శ్యామ్ సింగ‌రాయ్ టీజ‌ర్ ఎప్పుడంటే?

-

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లు గా వ‌స్తున్న సినిమా శ్యామ్ సింగ‌రాయ్. ఈ సినిమా ను డైరెక్ట‌ర్ రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే ఈ సినిమా కు సంబంధించిన ఇక క్రేజీ అప్ డేట్ ను సినిమా బృందం ప్ర‌క‌టించింది. శ్యామ్ సింగ‌రాయ్ టీజ‌ర్ విడుద‌ల చేసే డేట్ ను ఫిక్స్ చేస్తు నిర్ణ‌యం తీసుకున్నారు.

న‌వంబ‌ర్ 18 న టీజ‌ర్ ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్న‌ట్టు చిత్రం బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. అయితే ఈ సినిమా ను డిసెంబ‌ర్ 24 న తెలుగు తో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష ల‌లో విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా లో నాని రెండు పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు. శ్యామ్ సింగ‌రాయ్ గా ఒక పాత్ర. అలాగే వాసు అనే రెండో పాత్ర‌లో నేచుర‌ల్ స్టార్ నాని క‌నిపించ‌నున్నాడు. అయితే ఈ శ్యామ్ సింగ‌రాయ్ సినిమా లో నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్ర‌లో హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి న‌టిస్తుంద‌ని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news