టాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న కమెడియన్ ఎవరంటే..?

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లే కాదు వారితో సమానంగా కమెడియన్లు కూడా పారితోషకం తీసుకుంటూ దూసుకుపోతున్నారు. సాధారణంగా ప్రతి సినిమాలో కూడా కమెడియన్ పాత్ర అనేది చాలా కీలకం. కామెడీ లేని సినిమాలను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేరు. అందుకే తప్పకుండా ప్రతి సినిమాలో కూడా ఒక కమెడీయన్ ను పెట్టుకోవడం పరిపాటిగా వస్తోంది. అయితే హీరోలు, హీరోయిన్లతో సమానంగా కమెడియన్ కి కూడా పారితోషకం ఇవ్వడం అనేది చాలా అవసరం. కాబట్టి మన కమెడియన్లు కూడా రోజుకు కొన్ని లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. మరి అలా టాలీవుడ్ లో అత్యధిక పారితోషకం అందుకుంటున్న కమెడియన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

బ్రహ్మానందం:
హాస్యనటుడిగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న బ్రహ్మానందం చిరంజీవిని మొదలుకొని యంగ్ హీరోల సినిమాల వరకు ప్రతి సినిమాలో కూడా నటించి మెప్పించారు. హాస్యబ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన రోజుకు రూ.5లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నారు.

వెన్నెల కిషోర్:
సునీల్ కమెడియన్ పాత్రల నుంచి తప్పుకున్న తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ వెన్నెల కిషోర్ ముందుకు వచ్చారు. తనదైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నా రోజుకు రూ .3 లక్షల వరకు పారితోషకం అందుకుంటున్నారు.

అలీ:
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన అలీ కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా కొన్ని చిత్రాలలో నటించారు. ప్రస్తుతం ఈయన కమెడియన్ గా రూ .3.5 లక్షల వరకు ఒక్క రోజుకి పారితోషకం అందుకుంటున్నారు.

పోసాని కృష్ణ మురళి:
ఒకప్పుడు విలన్ గా కూడా మంచి పేరు దక్కించుకున్న పోసాని కృష్ణ మురళి రోజుకు రూ .2లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నారు.

ఇక వీరితోపాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ , సప్తగిరి తదితర కమెడియన్లు రోజుకు రూ.2 లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news