ఆ సినిమా విషయంలో డైరెక్టర్ కృష్ణవంశీని భయపెట్టింది ఎవరంటే..?

-

ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి.. ఆయన సినిమా టేకింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏదైనా సరే భిన్నంగా ఉండాలి.. చరిత్ర క్రియేట్ చేయాలి అని ఆలోచించే కృష్ణవంశీ ప్రతిసారి కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తారు. అయితే అలాంటి ఆయన ఒక సినిమా విషయంలో పూర్తిగా భయపడి దాక్కున్నారట. అసలు విషయంలోకెళితే సినిమా ఇండస్ట్రీలోనే ఒక చరిత్ర క్రియేట్ చేసిన మూవీ ఖడ్గం. ఆగస్టు 15వ తేదీ వచ్చిందంటే చాలు కచ్చితంగా టీవీలలో తప్పకుండా ఈ సినిమాను ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఖడ్గం సినిమా వెనుక కృష్ణ వంశీ భయం కూడా ఉందట.

శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్, రవితేజ, సోనాలి బింద్రే , సంగీత, కిమ్ శర్మ , బ్రహ్మాజీ తదితరులు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలోని పాటలు కూడా అప్పట్లో సంచలనం సృష్టించాయి. 2002 నవంబర్ 29న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. భారతీయులంతా ఒక్కటే అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా విడుదలైన తర్వాత కృష్ణవంశీకి చంపేస్తామని చెప్పి అనేక బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయట. అంతేకాదు ఎన్నో రోజులపాటు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సమాచారం.

ఈ సినిమాలో దేశభక్తి అంటే ఏమిటి? అసలు భారతీయుడు అంటే ఎలా ఉండాలి ?అనే విషయాలను చెప్పకనే చెప్పారు. ఎన్నో వివాదాలు సెన్సార్ కట్స్ తో వార్తల్లో నిలిచిన ఈ సినిమా చూసేవారి నరనరాల్లో దేశభక్తిని ఉప్పొంగించిందని చెప్పవచ్చు. 1990లో ముంబైలో జరిగిన దాడుల్లో చాలామంది చనిపోగా ఆ సమయంలో ఈ కథ రాసుకున్నారట కృష్ణవంశీ. ముఖ్యంగా టెర్రరిస్టుల బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా కృష్ణవంశీ జైలుకు వెళ్లి మరీ అధ్యయనం చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇకపోతే 72 రోజుల షూటింగ్లో ₹ 2.50 కోట్ల బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా ఐదు నంది అవార్డులను, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా దక్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news