బాలయ్యతో అవకాశం విజయ్ హీరోయిన్ ఫేట్ మారేనా..?

-

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో చాలా బిజీగా దూసుకుపోతున్నారు. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న తర్వాత బాలయ్య లో ఫుల్ ఎనర్జీ వచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం బాలయ్య వీరసింహారెడ్డి సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య కూతురుగా శ్రీ లీల నటిస్తున్నది. ఇప్పుడు బాలయ్యకు జోడీ గా ఒక యంగ్ హీరోయిన్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

బాలయ్య 108వ సినిమాల ప్రియాంక జవాల్కర్ నటించబోతున్నట్లుగా నిన్నటి రోజు నుంచి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్యతో సినిమా చేసిన తర్వాత ఈమె ఫేట్ మారుతుందని ప్రియాంక జవాల్కర్ అభిమానులు సైతం కామెంట్లు రూపంలో తెలియజేస్తున్నారు. మొదట విజయ్ దేవరకొండ తో కలిసి ఈ ముద్దు గుమ్మ టాక్సీవాలా సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం తో కలిసి SR. కళ్యాణ మండపం చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో అవకాశాలు వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది ప్రియాంక జవాల్కర్.

దీంతో ఈమె కెరియర్ పరంగా కాస్త వెనుకబడిందని చెప్పవచ్చు .ఇప్పుడు తాజాగా బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల సినిమాలో నటించే అవకాశం రావడంతో ఈమె కెరీర్ కు కలిసి వచ్చే అవకాశం ఉందని ప్రియాంక జవాల్కర్ అభిమానులు భావిస్తున్నారు. మరి బాలయ్య సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోందో లేదో తెలియాలి అంటే చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news