ప్రస్తుత కాలంలో చాలామంది యాంకర్లు తమ పాపులారిటీని దక్కించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రముఖ యాంకర్ లాస్య కూడా తాజాగా వంటలక్కగా మారిపోయింది.. యాంకర్ లాస్య ఒకానొక సమయంలో కొన్ని రూమర్స్ ఎదుర్కొని తర్వాత యాంకరింగ్ కి పూర్తిగా గుడ్ బై చెప్పేసి.. తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. గృహిణిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్న లాస్య ప్రస్తుతం భర్తకు వంట చేయడం కోసం కట్టెల పొయ్యి మీద కష్టపడుతోందని చెప్పవచ్చు. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది.
లాస్య తన జీవితంలో ఎన్నో కష్టాలను చవి చూసింది. ప్రేమించిన వ్యక్తి కోసం అన్నింటినీ అందరినీ వదిలేసుకొని వచ్చిన ఆమెకు మొదటి బిడ్డ పుట్టిన తర్వాతే తన కుటుంబం తనతో కలిసిందని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షో తో మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల బుల్లితెరకు దూరం అయింది. సడన్గా మళ్లీ బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ప్రత్యక్షమై హౌస్ లో ఉన్న వాళ్లందరిలో కంటే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ప్రత్యేకతను చాటుకున్న ఈమె తన రుచికరమైన వంటలతో జనాలను కట్టిపడేసింది.
ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా లాస్య మరొకసారి వంటలక్కగా మారి తన భర్త కోసం కట్టెల పొయ్యి మీద అద్భుతమైన వంట వండుతోంది.ఇది చూసిన నెటజనులందరూ ఆశ్చర్యపోతున్నారు. లాస్య కూడా వంటలక్కగా మారిపోయిందా ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రుచికరమైన నాటుకోడి కూరతో అందరి నోళ్లను వూరించేస్తుంది ఈ ముద్దుగుమ్మ.