ఈ దశాబ్దాన్ని ‘టెక్ డికేడ్.. టెకేడ్‌’గా మార్చడమే లక్ష్యం : మోదీ

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఆయన ఈరోజు వాషింగ్టన్​లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ దేశ ప్రథమ పౌరురాలు జిల్‌ బైడెన్‌తో కలిసి అలెగ్జాండ్రియాలోని ‘నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌’ను మోదీ సందర్శించారు. అనంతరం అక్కడే ప్రసంగించారు.

ఈ దశాబ్దాన్ని టెక్‌ దశాబ్దంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అమెరికా పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీ అన్నారు. ఈ క్రమంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం చేపడుతున్న చర్యలను వివరించారు. యువ ఔత్సాహితక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం ‘స్టార్టప్‌ ఇండియా మిషన్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మోదీ తెలిపారు. తద్వారా ఈ దశబ్దాన్ని ‘టెక్‌ డికేడ్‌’- ‘టెకేడ్‌’ గా మారుస్తామని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో భారత్‌- అమెరికా మధ్య సహకారం కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా- భారత్‌ భాగస్వామ్యం సుస్థిర, సమ్మిళిత ప్రపంచ వృద్ధికి దోహదం చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు వివరించారు. భారత్‌- అమెరికా మధ్య టీచర్స్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రాం ప్రారంభంపై సంకేతాలిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version