Yatra2 Trailer : యాత్ర 2 ట్రైలర్ రిలీజ్‌..దుమ్ములేపిన జగన్‌ !

-

Yatra2 Trailer :  యాత్ర 2 సినిమా గురించి తెలియని వారుండరు. దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో తమిళ నటుడు జీవ వైఎస్ జగన్ పాత్రలో నటిస్తున్నటువంటి తాజా చిత్రం యాత్ర 2. ఇదివరకే 2019 ఎలక్షన్స్ కి ముందు యాత్ర సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రము మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనికి సీక్వల్ గా ఎన్నికల ముందు యాత్ర 2 ను తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక కలిసి నిర్మిస్తున్నారు.

Yatra2Trailer

కాగా…ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. జగన్ పాదయాత్ర నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదల కానుంది.రాజశేఖర్ రెడ్డి మరణం ముందు, తర్వాత జగన్ పరిస్థితులు, ఆ తరువాత జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారు అనే విషయాలను ఈ చిత్రం లో చూపిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్‌ సీఎం జగన్‌ పాత్రలో నటించిన జీవా అద్భుతంగా నటించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version