ప్రభాస్ తో అలాంటి పనిచేయాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన పాయల్..!!

-

టాలీవుడ్ లో హీరో ప్రభాస్ అంటే అమ్మాయిలే కాదు హీరోయిన్స్ కూడా ఎంత ఇష్టపడుతూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ స్టైల్ , లుక్ ఇలా అన్నిటిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. హీరోయిన్స్ మాత్రం ప్రభాస్ సినిమాలలో చిన్న పాత్రలు వచ్చిన సరే నటించడానికి సిద్ధంగా ఉంటారు. అంతలా ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ప్రభాస్ గురించి తమ మనసులో మాటను తెలియజేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో హాట్ బ్యూటీ గా పేరు పొందిన పాయల్ రాజ్ పుత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. వాటి గురించి తెలుసుకుందాం.

పాయల్ టాలీవుడ్లో తన అందంతో గ్లామర్ తో కుర్రకారులను విపరీతంగా ఆకట్టుకుంటూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ చేసుకుంది. కేవలం ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా అంతగా సక్సెస్ కాలేక పోయింది. మొదటిసారిగా పంజాబీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన పాయల్ ఆ చిత్రంతో అందుకున్న సక్సెస్ ని తెలుగు తెరకు RX -100 సినిమాతో హీరోయిన్గా నటించిన ఈ చిత్రంతో ఓవర్ నైట్ కి ఈ ముద్దుగుమ్మ పాపులారిటీ సంపాదించుకుంది.

టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా కొన్ని సినిమాలలో అవకాశాలు అందుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది పాయల్ రాజ్ పుత్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ ప్రభాస్ తో ఒక సినిమాలో నటించాలని ఉంది అంటూ తెలియజేసింది.. అలాగే ఇప్పుడే ఇంటి నుంచి వచ్చాను అని తెలిపిన పాయల్.. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒకసారి చెక్ చేస్తే అందులో జిన్నా సినిమా గురించి ప్రభాస్ స్పందించడం జరిగిందని..అది తను షేర్ చేసినట్టుగా తెలియజేసింది. ఏదో ఒక రోజు ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటానని తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Actor Prabhas (@actorprabhas_)

Read more RELATED
Recommended to you

Latest news