శ్రీలీల కోసం తాపత్రయ పడుతున్న యంగ్ హీరోలు..!!

-

ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ లో శ్రీ లీల కి యూత్ లో మాంచి ఫాలోయింగ్ ఉంది. తాను సినిమాలు వరసగా చేస్తుండడం వల్ల  తన క్రేజ్ ఎక్కడా తగ్గడం లేదు. అందానికి అందం, చలాకి తనం, డాన్స్ తో కుర్రాళ్ళు ను థియేటర్స్ కు వచ్చేలా చేస్తోంది. ఇక రీసెంట్ గా రవితేజ తో చేసిన ధమాకా సినిమా  రికార్డ్ వసూళ్ళు కొల్ల గొడుతోంది.

తాజగా ఈ సినిమా 100 కోట్ల వసూళ్లు కు అతి చేరువ అయ్యింది. ఈ సినిమా తో అమ్మడు గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.ప్రస్తుతం అమ్మడి చేతిలో ఇప్పటికిప్పుడు 6 సినిమాలు ఉన్నాయంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమె డేట్స్ రెండు సంవత్సారాల వరకు ఖాళీ లేదంటే చూసుకోండి. ఈమె యవ్వారం చూసిన రవితేజ ఆమెతో నెక్స్ట్ సినిమా కు నాకు డేట్స్ దొరికేలా లేవు అని అన్నాడంటే ఆమె పాపులారిటీ అలా ఉంది.

ఇక రీసెంట్ గా రెమ్యునరేషన్ కూడా డబుల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె ఎంత అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.సినిమాల తో పాటు  సోషల్ మీడియాలో తన అందానికి మరింత పదును పెడుతోంది. కొత్త అందాలతో కొత్త భంగిమలతో  పద్ధతిగా ఉండే డ్రెస్సులు తో మనసు దోచేస్తోంది. ప్రస్తుతం కుర్ర హీరోలు అందరూ ఆమె తో జత కట్టాలని తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version