ప్రముఖ నేపథ్య గాయకుడు గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని వేల చిత్రాలకు తన స్వరాన్ని అందించిన బాలసుబ్రమణ్యం ఇటీవల అనారోగ్య సమస్యతో స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఇక పోతే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆయన ఆస్తులు కూడా అంతే స్థాయిలో కూడబెట్టారు. ఇకపోతే ఆయన సంపాదించిన డబ్బు అంతా ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేసే వారు. అలా భూములు కొనుగోలు చేయడంతో పాటు భవనాలు కూడా కట్టించారు. మరి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఆస్తులు కోల్పోవడానికి గల కారణం ఆయన వారసుడు ఎస్.పీ. చరణ్ అని చెప్పవచ్చు. ఒకానొక సమయంలో చరణ్ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి తన తండ్రి ఆస్తిని కూడా పోగొట్టాడు అనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి.
అయితే ఎట్టకేలకు ఈ విషయాలపై ఎస్పీ చరణ్ స్పందించడం జరిగింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం వారసుడిగా చరణ్ తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో సుమారు 2500 పాటలకు పైగా గానాలాపన చేసి రికార్డు సృష్టించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక తెలుగులో ప్రభాస్ నటించిన వర్షం సినిమా ను తమిళ్ లో రీమేక్ చేసి పూర్తిస్థాయిలో నష్టపోయాడు చరణ్. ఇకపోతే చరణ్ ఇక్కడుంటే చెడిపోతారు అనే కారణంతో ఎస్పీ బాలసుబ్రమణ్యం అమెరికాలోనే చరణ్ ను చదివించాడు . కానీ తనకు పాటల పై ఉన్న మక్కువ మాత్రం పోలేదు. ఇక ఎన్నో సినిమాలకు పాటలు పాడిన చరణ్ ఆ తర్వాత బుల్లితెరపై నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.ఇక ఆ తర్వాత నిర్మాతగా 10 సినిమాలకు బాధ్యతలు నిర్వహించి పూర్తిగా ఆస్తులను పోగొట్టాడు అని భోగట్టా. ఒక రోజు చరణ్ మాట్లాడుతూ నాన్న సంపాదించిన ఆస్తిలో సగానికి పైగా నేను పోగొట్టుకున్నాను. నాన్న ఎవరికి తనను రిఫర్ చేయలేదని తన భార్య ఎప్పుడూ బాధపడుతూ ఉంటుందని తెలిపారు. అయితే నాన్న ఆస్తులు అయితే పోగొట్టాను కానీ ఏ రోజు కూడా నాన్న పేరు చెడగొట్ట లేదు అని తెలిపారు.