గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట నూనెల పెరుగుదల సామాన్యులకు షాకుల మీద షాక్ ఇస్తోంది. గతంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. వంటనూనెల ధరలు కూడా భగ్గుమన్నాయి. కూరగాయల ధరలు కూడా అలాగే పెరిగాయి. అయితే. ఇప్పుడు వంటనూనెల ధరలు తగ్గడం ఊరటనిస్తోంది. అంతర్జాతీయ విపణిలో నూనె ధరలు తగ్గడంతో దేశీయంగానూ తగ్గుముఖం పట్టాయి. పామాయిల్ ధర లీటరుకు రూ. 7-8 తగ్గగా, సన్‌ఫ్లవర్ నూనె ధర రూ. 10 నుంచి 15 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది.
సోయాబీన్ ఆయిల్ ధర రూ. 5 తగ్గినట్టు భారతీయ వంటనూనెల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు సుధాకర్‌రావు దేశాయ్ తెలిపారు. ఫ్రీడం సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరను గత వారం రూ. 15-20 తగ్గించినట్టు హైదరాబాద్‌కు చెందిన జెమిని ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ కంపెనీ తెలిపింది. ఈ వారం మరో 20 రూపాయలు తగ్గించనున్నట్టు పేర్కొంది.