హమాస్ కిరాతక దాడులపై గూగుల్ సీఈఓ దిగ్బ్రాంతి

-

ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా లోని హమాస్ అనే ఉగ్రవాద సంస్థకు మధ్యన భీకరంగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం లో హమాస్ కు చెందిన వారు ఇవ్వరని చూడకుండా అందరినీ దారుణంగా కాల్చి చంపేస్తున్నారు.. ఇంకా నిన్న అయితే పసిపిల్లలను తలలు వేరు చేసి చంపడం ఎంత అమానవీయమో ? ఇక తాజాగా ఈ హమాస్ దాడుల పటేల్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు… మొదటగా ఈ దారుణమైన ఘటనల పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని తెలియచేసారు. ఇజ్రాయెల్ లో గూగుల్ లో పని చేస్తున్న తమ ఉద్యోగులు అందరికీ కూడా మెయిల్ ద్వారా తన యొక్క సానుభూతిని ప్రకటించారు. ఇక ఈయన మాట్లాడుతూ, ఇజ్రాయెల్ లో మా కంపెనీ లలో పనిచేస్తున్న మరియు వివిధ పనులతో ఆదేశంలో ఉన్న మా ఉద్యోగులతో మేము ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉన్నామని, వారికి అన్ని విధాలుగా సహాయపడుతూ సంప్రదింపులు జరుపుతున్నామని పిచాయ్ భరోసాను కల్పించారు.

ఇక పిచాయ్ తెలుపుతున్న సమాచారం ప్రకారం గూగుల్ కోసం 2 వేల మందికి పైగా ఇజ్రాయెల్ నుండి పనిచేస్తున్నట్లు తెలియచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news