World Cup 2023 : టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. డెంగీ జ్వరంతో బాధపడుతున్న భారత స్టార్ బ్యాటర్ శుబ్ మన్ గిల్ ఇవాళ అహ్మదాబాద్ వెళ్ళనున్నారు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన అతడికి బీసీసీఐ వైద్యబృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగనుంది.

భారత్ ఈ నెల 14న అహ్మదాబాద్ లో మ్యాచ్ ఆడుతుండడంతో గిల్ చెన్నై నుంచి నేరుగా అక్కడికే వెళుతున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
కాగా, భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ తరుణంలో.. గ్రాండ్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అక్టోబర్ 14న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం బీసీసీఐ భారీ ఎత్తున ఏర్పాటు చేస్తోంది. మ్యాచ్ కు ముందు అదిరిపోయే వేడుకలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.