చితాభస్మాభిషేక జ్యోతిర్లింగ క్షేత్రం గురించి మీకు తెలుసా !

ద్వాదశ జ్యోతిర్లింగాలు.. అంటే తెలియని శివభక్తులు ఉండరు. ఆ క్షేత్రాలను జీవితకాలంలో ఒక్కసారి సందర్శిస్తే చాలు పునర్జన్మ ఉండదు అని పురాణాలు చెపుతున్నాయి. వీటిలో ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత. అలాంటివాటిలో పశ్చిమాభిముఖుండైన జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం…

Ujjain Mahakaleshwar Swami Temple
Ujjain Mahakaleshwar Swami Temple

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్‌కి 80 కి . మీ దూరంలో ఉజ్జయిని నగరంలో క్షిప్రా నదీతీరాన ” శ్రీ మహాకాళేశ్వర స్వామి ” జ్యోతిర్లింగరూపమున దర్శనమిస్తారు. ఈ ఆలయం మూడు అంతస్తులుండి, ఏడు గోపురాలుండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. మొదటి అంతస్తులో మహాకాళేశ్వరుడు, రెండవ అంతస్తులో ఓం కారేశ్వరుడు, మూడ వ అంతస్తులో నాగచంద్రేశ్వరుడు కొలువై వుంటారు. ఈ మూడవ అంతస్తు మాత్రం నాగపంచమి నాడు మాత్రమే తెరిచి పూజాది కాలు చేస్తూవుంటారు. మిగిలిన రోజుల్లో ఈ అంతస్తు మూసివుంటుంది. ఇక ఈ ఆలయంలో 3 అడుగుల వ్యాసంతో 21/2 అడుగుల ఎత్తున్న జ్యోతిర్లింగే శ్వరుడు పశ్చిమ దిక్కుగా ప్రతిష్టితు డయ్యాడు. ఇక్కడ చితాభస్మంతో చేసే అభిషేకం చాలా ప్రాశస్య్తమైనది. పూర్వం ఒక సాధువు స్మశానం నుంచి చితాభస్మాన్ని తెచ్చి అభిషేకించి వెళ్ళిపోయేవాడట. ఆయనని ఎవరూ దర్శించలేకపోయారు. ఇప్పుడుడు మాత్రం ఇక్కడ అగ్నిహోమం లోనున్చి వచ్చిన భస్మంతో స్వామిని అభిషేకిస్తున్నారు.

ఈ ప్రాంతంలో ఎక్కువగా అఘోరలు, కాపాలికులు, తాంత్రికోపాసన చేస్తూ ఇక్కడ గుహలలో నేటికీ కనిపిస్తూంటారు. ప్రతి నిత్యం ఇక్కడ జరిగే భస్మాభిషేకం అత్యంత అద్భుంతంగా ఉంటుంది. మరణ భయం ఉన్నవారు, అపమృత్యుదోషాలు ఉన్నవారు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే ఆ దోషాలు పోతాయి. అదేవిధంగా ఈక్షేత్రంలో అష్టాదశ పీఠం అమ్మవారు మహాకాళీగా ఉంది. దీంతో ఈ క్షేత్ర వైభవం మరింత ప్రఖ్యాతి గాంచింది. మహాకాళ, కాళీ క్షేత్రంలతో ఎందరో కవులకు, జ్ఞానులకు ఈ క్షేత్రం ఆరాధ్యమైంది. కాళిదాసు, భోజరాజు వంటివారు ఉజ్జయినికి చెందినవారే. కాళిదాసును అమ్మ అనుగ్రహించింది ఈ క్షేత్రంలోనే. ఈ ప్రాంతానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం ఉంది.

– కేశవ