ఐదురోజుల పండుగ దీపావళి.. ధ‌న‌త్ర‌యో ద‌శి నుండి బ‌లిపాడ్య‌మి వ‌ర‌కు ఏరోజు ఏ పూజ

-

దీపావ‌ళి ఐదు రోజుల పండుగ విశేష ఫ‌లితాన్ని ఇవ్వ‌డానికి ధ‌న‌త్ర‌యో ద‌శి నుండి బ‌లిపాడ్య‌మి వ‌ర‌కు ల‌క్ష్మిదేవిని య‌ముడు ,కృష్ణుడు, ఇష్ట దైవాన్ని పూజించుకుంటే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి.

వ్యాపారస్తులకు దీపావళి కొత్త సంవత్సరం!

అమావాస్య అంటే చిమ్మచీకట్లు.. కొత్త పనులు ఏవీ ప్రారంభించరు. కానీ ఏడాది మొత్తంలో ఒక్క దీపావళి మాత్రం దీపావళి వెలుగుల జిలుగులతో పౌర్ణమిని తలపిస్తుంది. వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా నేటి నుంచి ఇండ్లలో, ప్రధాన ద్వారాల వద్ద దీపారాధన చేయడం అనాదిగా వస్తుంది.

దీపావళి ఐదురోజుల పండుగ!

దీపావళి ముందు త్రయోదశిని ధనత్రయోదశి-ధన్‌తేరాస్ అని అంటారు. ఈ రోజు – నిజానికి ఇది ధన్వంతరీ ఆవిర్భవించిన రోజు. ఈ రోజున క్షీరసాగర మథనంలో ధన్వంతరీ ఆవిర్భవించిన రోజు. దీన్నే ఆయుర్వేద వైద్యులు..మన ప్రాచీనులు చాలా ఘనంగా చేసుకుంటారు. ఇప్పటికి ఉత్తర భారతంలో ఈ రోజును డాక్టర్స్ డేగా జరుపుకొంటారు. ఈ రోజు సాయంత్రం అత్యంత విలువైన ఆరోగ్యం బాగుండాలని సాయంత్రం సంధ్యవేళ ప్రధాన ద్వారానికి ఇరువైపుల రెండు దీపాలను వెలిగిస్తారు. దీనివల్ల యముడు సంతోషించి కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడని ప్రతీతి. కొన్నేండ్లుగా ధన్‌తేరాస్ రోజున బంగారం లేదా ఏదైనా ఒక కొత్త వస్తువు తప్పక కొనాలని చాలామంది ప్రచారాలు చూసి ఆచరిస్తున్నారు. కానీ దీనికి శాస్త్ర ప్రమాణాలు లేవు. అది వారివారి ఇష్టాఇష్టాలపై నమ్మకాలపై ఆధారపడిన విషయం.

నరకచతుర్దశి- నివాళులు (మంగళారతులు)
ఉత్తర భారతదేశంతోపాటు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దీపావళి అంటే ప్రధానంగా నరకచతుర్దశి నాడు నివాళులు అంటే మంగళారతులు ఇచ్చే సంప్రదాయం నేటికి కొనసాగుతుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి దంతధావనం చేసుకుని మంగళారతులను తీసుకుని దేవుడికి, తులసమ్మ (తులసి చెట్టు)కు, తర్వాత కుటుంబ సభ్యులకు మంగళారతిని ఇస్తారు. ఈ సమయంలో మంగళారతి పట్టిన ఆడపడుచులకు అన్నదమ్ములు, తల్లిదండ్రులు మంచి కానుకలను ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది. తర్వాత ఇంటి బయట చిన్నచిన్న బాణాసంచ కాలుస్తారు. తర్వాత అభ్యంగన స్నానం ఆచరించి దేవుని పూజాదికాలు చేసుకుంటారు. తర్వాత ఫేనీలు తినడం ఆనవాయితీ.

లక్ష్మీపూజ- దస్త్రం పూజ

దీపావళి ఈరోజున వ్యాపారస్తులు కొత్త సంవత్సరంగా పరిగణించి వ్యాపార లావాదేవీలకు సంబంధించి కొత్త పుస్తకాలను ప్రారంభిస్తారు. నిజానికి ఈ ఆచారం భారతదేశంలో వేల ఏండ్లుగా వస్తుంది. ఉత్తర భారతంలో నేటికి దీన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. తెలంగాణలో చాలామంది వ్యాపారులు కూడా లక్ష్మీ పూజలు నిర్వహించి కొత్త దస్ర్తాలు ప్రారంభిస్తారు. ఖాతాదారులకు కానుకలు ఇస్తారు. సంతోషంగా బాణాసంచ కాల్చి దీపావళి లక్ష్మీ పూజ వేడుకలను నిర్వహించుకుంటారు.

బలిపాడ్యమి- దీపావళి తర్వాతి రోజును బలిపాడ్యమి అంటారు. వామన అవతారంలో బలి చక్రవర్తిని మొదటి పాదనం ధనత్రయోదశిన, రెండోపాదం చతుర్దశినాడు, మూడో పాదం అమావాస్యనాడు బలి చక్రవర్తిప మూడు అడుగులు వేసి పాతాళానికి తొక్కివేస్తారు. తర్వాతి రోజు బలి చక్రవర్తిని అనుగ్రహించిన రోజు కాబట్టి ఆ రోజున బలిపాడ్యమిగా జరుపుకుంటారు.ఈరోజున గుమ్మడి కాయలు దానం చేస్తుంటారు. దీనివల్ల విశేష ఫలితం వస్తుందని పూర్వీకులు చెప్పుతారు. భూమిదానం ఇచ్చినంత ఫలితం లభిస్తుందని ప్రతీక. గోవర్ధన పూజ- గోవర్ధనోర్ధన గిరిని ఉద్దరించిన రోజు కాబట్టి ఈ రోజున గోవర్ధన పూజ చేయడం కొన్నిచోట్ల ఆచరిస్తారు. దీన్నే అన్నకూటోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది.

– కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

Read more RELATED
Recommended to you

Exit mobile version