భక్తుడి కోరిక మేరకు చెట్టులో వెలసిన ఆంజనేయ స్వామి…!

-

ఈ పేరు వినగానే పిల్లలైనా,పెద్దలైనా ఒక విధమైన ఉత్సాహంతో, భక్తి భావనలో కి జారుకుంటారు. కానీ ఒక రాక్షసుని భక్తి పారవశ్యాన్ని చూసి పొంగి పోయిన ఆంజనేయుడు ఆ భక్తుని కోరిక మేరకు ఒక చెట్టులో వెలిశాడు. ఈ క్షేత్రాన్ని ఒక సారి దర్శించుకోవాలి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని, జంగారెడ్డి గూడెం మండలంలో, ప్రవహిస్తున్న ఎర్ర కాలువ ఒడ్డున ఉన్న గుర్వాయి గూడెం అనే గ్రామానికి వెళ్ళాలి.

ఈ క్షేత్ర విశేషాలు ప్రకారం పూర్వము త్రేతా యుగంలో రామ, రావణ యుద్ద సమయంలో రాముడికి సహాయంగా పోరాడుతున్న హనుమను చూసి మద్వాసురుడు అనే రాక్షసుడు భక్తి భావన తో మనసు చలించి అస్త్ర సన్యాసం చేసి ప్రాణ త్యాగం చేశాడు. తరువాత ద్వాపర యుగం లో కౌరవులు, పాండవుల యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడుతున్న మధ్వుడు అర్జునుడి రధమునకు ఉన్న జండా మీద ఆంజనేయుడు బొమ్మ చూసి గత జన్మ గుర్తుకు వచ్చి హనుమా అంటూ ప్రాణ త్యాగం చేశాడు.

కలియుగంలో మధ్వ మహర్షిగా ఎర్ర కాలువ ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఒక రోజు ఎర్ర కాలువ లో స్నానం చేసి వస్తూ పడిపోబోతుంటే ఎవరో పట్టుకుని లాగినట్లు అనిపించింది, తిరిగి చూస్తే ఒక వానరం. ఆ వానరూడు ఆయనను కూర్చోపెట్టి రోజూ సపర్యలు చేసింది. ఒక రోజు ఆ మహర్షి ఈ వానారమే ఆంజనేయుడు గా గుర్తించి ఇన్ని రోజులు నీతో సపర్యలు చేయించుకున్నాను అని పాదాలు మీద పడి ఏడ్చాడు.

దానికి హనుమా ప్రత్యక్షం అయ్యి నీ భక్తి కి మెచ్చి నీకు సేవలు చేశాను. నీకు ఏమి వరం కావాలో కోరకోమన్నాడు. దానికి మద్యుడు నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండమంటాడు. సరే నువ్వు ఇక్కడే మద్ది చెట్టు లాగా అవతరించు, నేను కూడా చెట్టు కింద శిలా రూపంలో ఉంటాను అని అదృశ్యమయ్యాడు. అందుకే ఈ క్షేత్రానికి మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రంగా పేరు వచ్చింది. ఇక్కడ 7 మంగళ వారాలు 108 ప్రదక్షిణలు చొప్పున చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news