అసెంబ్లీకి వెళ్ళకపోతే వెంటనే రాజీనామాలు ప్రకటించాలి : వైఎస్ షర్మిల

-

మిర్చి రైతుల కష్టాలపై వైసీపీ ముందుగానే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ. రేట్ల హెచ్చుతగ్గులపై రైతు నష్టపోకుండా రూ.5వేల కోట్లతో.. ధరల స్థిరీకరణ నిధి పెట్టాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రం నుంచి వెంటనే నిధులు తేవాలని అడిగింది కాంగ్రెస్ పార్టీ. సూపర్ సిక్స్ లో భాగంగా పెట్టుబడి సహాయం రూ.20 వేలు వెంటనే అందించాలని కోరింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి నెల కూటమి హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ.

అసెంబ్లీలో అడిగే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి.. 11 సీట్లతో అసెంబ్లీకి వెళ్ళే అవకాశం మీకుంది కాబట్టి.. వైసీపీని శాసన సభకు వెళ్ళాలని డిమాండ్ చేశాం. రైతుల పట్ల కూటమి నిర్లక్ష్యాన్ని సభ వేదికగా ఎండగట్టాలని అడిగాం. చంద్రబాబు గారి సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూనే, వైసీపీ అసెంబ్లీకి వెళ్ళాలని కోరితే.. ప్రజల పక్షాన నిలబడాలని అడిగితే.. వ్యక్తిగత అజెండా అంటూ వైసీపీ నేతలు భుజాలు తడుముకోవడం హాస్యాస్పదం. సమాధానం చెప్పలేక దాటవేయడం మీ అవివేకానికి నిదర్శనం. మళ్ళీ మళ్ళీ వైసీపీనీ అడుగుతున్నాం. అసెంబ్లీకి వెళ్ళే అంశంపై మీ పాలసీ ఏంటో చెప్పండి. అసెంబ్లీకి వెళ్ళకపోతే వెంటనే రాజీనామాలు ప్రకటించండి అని వైఎస్ షర్మిల డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version