వాస్తు: వీటిని కనుక ఇంట్లో ఉంచితే ఆనందం ఉండదు…!

-

వాస్తు శాస్త్రం ప్రకారం పండితులు కొన్ని విషయాలను తెలియజేశారు. వీటిని కనుక పాటించారంటే ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. ఇంట్లో కనుక మీరు వీటిని ఉంచితే మీ ఇంట్లో అస్సలు ఆనందం ఉండదని అటువంటివి మీరు ఉంచుకోకూడదు అని పండితులు అంటున్నారు. మరి ఆలస్యం ఎందుకు వీటి కోసం ఇప్పుడే పూర్తిగా చూద్దాం.

కొన్ని కొన్ని సార్లు అనుకున్నది సాధించగలుగుతారు. అనుకున్నంత సంపాదన కూడా ఉంటుంది కానీ ఆనందం ఉండదు. ఆనందం ఉండాలంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగించుకోవాలి. ఈ సామాన్లు కనక ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుందని ఆనందం ఉండదు అని పండితులు చెబుతున్నారు.

విరిగిపోయిన దేవుడి విగ్రహాలు:

కొందరు ఇంట్లో విరిగిపోయిన దేవుడి విగ్రహాలను ని ఉంచుతారు. వీటివల్ల మంచి జరగదని నెగిటివ్ ఎనర్జీ మాత్రమే అక్కడ ఉంటుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి మీకు కనుక ఈ సమస్యలు ఉంటే తప్పని సరిగా మీరు వాటిని తొలగించండి.

ఇంటిని శుభ్రంగా ఉంచండి:

ఇల్లు ఎప్పుడూ కూడా అందంగా శుభ్రంగా ఉండాలి. ఇంట్లో సర్దుకోకుండ చిందరవందరగా ఉంటే అటువంటి చోట ఆర్థిక సమస్యలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

ఇంట్లో సాయంత్రం పూట లైట్ వేయండి:

చీకటిగా ఉండే చోట కూడా నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. సంధ్య వేళ అయినప్పుడు కచ్చితంగా లైట్ వేయండి. దీనితో నెగటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది.

అవసరం లేని మందులను ఇంట్లో ఉంచొద్దు:

వాస్తు శాస్త్రం ప్రకారం పనికి రాని మందులని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మంచి కలగదు కాబట్టి వాటిని కూడా మీరు మీ ఇంట్లో నుంచి తొలగించండి. తద్వారా అనేక సమస్యలు నుండి మీరు బయట పడడానికి, ఇంట్లో ఆనందంగా ఉండడానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version