చాలా మంది సోమవారం నాడు ఇళ్లల్లో శివుడికి పూజ చేస్తూ ఉంటారు. అలాగే ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శివలింగానికి పూజ చేసేటప్పుడు కచ్చితంగా వీటిని శివ లింగానికి అర్పించకూడదని పండితులు అంటున్నారు. పరమ భక్తి శ్రద్ధలతో నిష్టతో పరమశివుడిని కొలిస్తే ఎంతటి సమస్య అయినా తొలగిపోతుందని.. పరిష్కారం కనబడుతుందని భక్తుల నమ్మకం. అయితే పరమశివుడిని పూజించేటప్పుడు అసలు ఇవి అర్పించద్దు.
శివలింగానికి పూజ చేసేటప్పుడు సింధూరాన్ని పరమశివుడికి అర్పించకూడదని గుర్తుంచుకోండి. చాలా మంది దేవతలకు సింధూరం అంటే ఎంతో ప్రీతి. కానీ శివుడికి మాత్రం అస్సలు సింధూరం అర్పించకూడదు. ఆధ్యాత్మిక ధార్మిక విశ్వాసాలు ప్రకారం అశుభంగా పరిగణిస్తారని గుర్తుపెట్టుకోండి. అదే విధంగా సనాతన ధర్మం ప్రకారం పసుపుని చాలా స్వచ్ఛమైన పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కానీ శివుడికి అసలు అర్పించకూడదు.
శాస్త్రాల ప్రకారం శివలింగం పురుష తత్వానికి చిహ్నం పసుపు మహిళలకు సంబంధించినది అందుకని శివుని ఆరాధించేటప్పుడు పసుపుని ఉపయోగించవద్దు. అలానే పూజ సమయంలో శంఖంలో నీళ్ళుపోసి దేవుళ్లపై వేస్తారు. కానీ శివారాధన లో శంఖాన్ని ఉపయోగించకూడదు. శివ పురాణం ప్రకారం శంకరుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడు చేతిలో వధించబడ్డారు. కాబట్టి శివారాధనకి శంఖంతో నీటిని ఇవ్వకూడదు.
అదే విధంగా తులసిని కూడా శివుడికి అర్పించకూడదు. ఎందుకంటే పురాణాల ప్రకారం జలంధరుడు అనే రాక్షసుడినికి అతని భార్య పవిత్రత కారణంగా అమరుడై ఉండే వరాన్ని ఇస్తాడు. అమరుడు కావడంతో అతడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విష్ణువు శివుడు అతన్ని చంపడానికి ప్రణాళిక వేస్తారు. జలంధరుడు మరణం గురించి బృంద తెలుసుకొని కోపానికి గురి అవుతుంది. ఈ కోపంలో తులసి ఆకుల్ని శివారాధన ఎప్పుడు వినియోగించకూడదు అని శపిస్తుంది. అందుకు తులసిని వాడకూడదు.