ఈవీఎంల మీద సందేహాలు వద్దని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. మనదిపరిణతి కలిగిన ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు. ఎవరి బాధ్యతలు ఎంటో, ఏ విధానంలో ఓటు వేయాలో ప్రజలకు బాగా తెలుసని వెల్లడించారు.
ఈవీఎంలపై సందేహాలు అవసరం లేదని, సుప్రీంకోర్టు పదే పదే వాటి పనితీరును ధ్రువీకరించిందని స్పష్టంచేశారు. మనం దానిని అంగీకరించాలని మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు.యువత పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. నిర్ణీత వయసు రాగానే ఓటు హక్కు కల్పించే కొన్ని రాజ్యాంగాల్లో మనది ఒకటని ఆయన తెలిపారు. నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.