కుల గణన సర్వే మీద కొందరు అపోహలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీ లకు కుల గణన సర్వే ఎలా జరిగింది అనేది ప్లానింగ్ డిపార్ట్ మెంట్ వివరిస్తుంది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం తర్వాత ఇంత శాస్త్రీయంగా, లాజికల్ గా దేశంలోని ఏ రాష్ట్రంలో కుల గణన జరగలేదు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండవద్దని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వివరణ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అన్ని కులాలకు సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే జరిగింది. సర్వే పై ప్రజలు ఎవరికి ఇందులో అపోహలు అవసరం లేదు.
మొదట సమగ్ర కుటుంబ సర్వే తో పోల్చుకున్నారు.. అది పబ్లిక్ డొమైన్ లో లేని డాక్యుమెంట్. ఎస్సీ వర్గీకరణ కూడా 2011 ను ఆధారంగా చేసుకొని చేసిందే. వ్యక్తిగత వివరాలు కాకుండా.. రేపు ఎల్లుండి లోగా పబ్లిక్ డొమైన్ లో కులాల వారిగా, ఉప కులాల వివరాలను జిల్లాల వారిగా పెడతాం. సర్వే పై అపోహలు,అనుమానాలు ఉన్న కుల సంఘాల నేతలను పిలిచి.. చర్చించి నివృత్తి ఇస్తాం. కుల గణన సర్వే నివేదిక ఆధారంగా సంక్షేమం పథకాల రూపకల్పన కోసం ఉపయోగిస్తాం అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.