దేశంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వింటున్నమాట పెండ్లికావట్లేదు. మరీ ముఖ్యంగా మగవారి పెండ్లికి పడే బాధలు వర్ణనాతీతం. అయితే పండితులు, జ్యోతిష శాస్త్రజ్ఞులు అనుభవ పూర్వకంగా చెప్పిన గొప్ప పరిహారాలు, తంత్రాలు మీ కోసం..
పురుషులకు వివాహం ఆలస్యం అవుతుంటే
1. కింది మంత్రాన్ని 108 సార్లు జపంచేయండి. పత్నీం మనోరమాం దేహి మనోవఋత్తానుసారిణీమ్!
తారణీం దుర్గసంసారసాగరస్యకలోద్భువామ్!!
2. శ్రీరామ పట్టాభిషేక చిత్రానికి పంచోపచార పూజలు చేసి కింద దోహను భక్తితో, విశ్వాసంతో 21 సార్లు పటించండి. తబ జనకపాయి వసిష్ట ఆయసు బాహ్య సాజ సంచారి కౌ !
మాండవీ శ్రుతికీరతి ఊర్మిళా కుఆరి లయీ హకారి కౌ!!
3. కనకధారా స్తోత్రం 21 సార్లు 90 దినాలు పఠించడం
4. జాతక రీత్యా శని, కుజ,చంద్ర,గురు దోషాలు వుంటే ఆయా గ్రహాలకు పరిహారాలు చేసుకోండి.
5 కుజ దోష నివారణకు దేవీ అష్టోతర స్తోత్రం, కుజ స్తోత్రం 21 సార్లు జపించాలి.
6 సౌందర్య లహరిలో 1 నుంచి 27వ శ్లోకం వరకు పఠించాలి
7 శ్రీకాళహస్తిలో రాహు, కేతు పూజ చేసుకోండి.
8 కుజదోషం ఉన్నవారు తియ్యని తండూరీ రొట్టెలు దానం చేయండి.
పై పరిహారాలను భగవంతుని మీద విశ్వాసం ఉంచి ఆచరించండి. తప్పక వివాహం జరుగుతుంది.
నోట్- మీ జాతకాలను అనుభవజ్ఞులైన జ్యోతిషులకు చూపి పరిహారాలను తెలుసుకోండ, పైన చెప్పినవి ఆచరించండి. జనన సమయం, తేదీ లేనివారు ప్రశ్న లగ్నాలు చెప్పే పండితుల దగ్గరకు వెళ్లి విషయాలను తెలుసుకోండి. వీలుకాకుంటే పైన చెప్పినవాటిని ఆచరించండి దైవానుగ్రహంతో మీకు అంతా శుభం జరుగుతుంది.