శని అనుగ్రహం కోసం శనివారం ఇలా చేయండి !

శని.. అంటే చాలు చాలామందికి భయం. ఈ గ్రహ ప్రతికూలతతో అనేక కష్టాలు. కానీ నిజానికి శనిదశలో మంచి జరుగుతుంది. జీవితానికి కావల్సిన శక్తిని ప్రసాదిస్తాడు. అయితే దాన్ని అర్థం చేసుకోవడంలో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సరే ఇక సామాన్యంగా శనిబాధలు పోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇవి అందరూ చేయలేరు. కానీ పూర్వం నుంచి పండితులు అందరూ చేసుకునే కొన్ని పవిత్రమైన పవర్‌ఫుల్‌ చిట్కాలు చెప్పారు. వాటిని తెలుసుకుందాం…

these signs people should offer shani puja on Shani trayodashi

అందరికీ నూనెతో కూడా అభిషేకం చేసే స్తోమత వారికి ఉండకపోవచ్చు. ఇలాంటి వారికోసం శ్రీ మద్రామాయణంలోని సుందరకాండలోని 48వ సర్గను శనివారం ఉదయం ,సాయంకాలం పఠిస్తే.. శనిదేవుని అనుగ్రహం పొందవచ్చు. ఇది ఖర్చులేని పని. వీటితోపాటు హనుమాన్‌చాలీసా పారాయణం, వేంకటేశ్వరస్వామి గోవిందనామాలు, శుద్ధజలంతో శివాభిషేకం చేసినా మంచి ఫలితం వస్తుంది. ధనం లేదని బాధపడకండి. పైన చెప్పిన ఏదైనా ఒకదాన్ని భక్తితో, శ్రద్ధతో ఆచరించండి. తప్పక శనిబాధలు పోతాయి.

– శ్రీ