మీ జాతకంలో రవి దోషాలున్నాయా … దోషాలు పోవడానికి ఏం చేయాలి ?

-

జాతకంలో రవి బలహీనంగా ఉన్నాడా.. లేక ఇబ్బందికరమైన స్థానాల్లో ఉంటే మీరు తప్పక ఈ విషయాలను తెలుసుకోవాలి.జాతకం మీకు తెలియక పోయినా కింది లక్షణాలు ఉన్నాయేమో పరిశీలించుకోండి…

తరుచుగా ఎక్కువ లాలాజలం ఉరుతున్నా.. అంటే సొల్లు ఎక్కువగా వస్తున్నా, అవయవాల్లో తిమ్మిర్లు, బలహీనత, కలర్ ైబ్లెండ్‌నెస్ (ఎరుపు, గ్రే రంగు), మీకు మీరే ఆత్మస్తుతి చేసుకుంటున్నా, కంటి చూపు తగ్గుతున్నా, సాంఘికంగా మీరు దూరంగా ఉంటూ అంటే అందరితో కలువాలనిపించకుంటే మీకు తప్పక రవి దోషాలు ఉన్నాయని చెప్పవచ్చు.

Do you have flaws in your astrology follow these steps

దోషాలు పోవడానికి ఎం చేయాలి ?

కొత్త పని ప్రారంభించేటప్పుడు లేదా ఇంటి నుంచి మీరు బయటకు పోయేటప్పుడు తప్పకుండా ఒక గ్లాసు నీళ్లు తాగండి. ఈ నీటిలో కొంచెం చక్కెర వేసుకోవాలి. మాంసాహారాన్ని తీసుకోకండి. నల్ల ఆవు,కోతికి అవకాశం దొరికినప్పుడల్లా ఆహారాన్ని పెట్టండి. వీలైతే ప్రతిరోజు మీ తల్లి ఆశీర్వాదాన్ని తీసుకోండి అంటే ప్రతిరోజు తల్లికి నమస్కారం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి వద్ద నుంచి మీరు ఉచితంగా ఏ బహుమతిని స్వీకరించకండి. తల్లిదండ్రుల నుంచి తీసుకోవచ్చు. డార్క్ రెడ్/రూబీ రంగు దుస్తులను దానం చేయండి. తప్పక మీకు రవి దోషాలు తొలిగిపోయి అంతా మంచి జరుగుతుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version