సోమవారం ఏం పనులను చెయ్యకూడదో తెలుసా?

-

ఏడు వారాలు ఏడు దేవుళ్ళకు కేటాయించారు.. ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అని..ఇందులో ఆదివారం సూర్యుడు, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వేంకటేశ్వర స్వామికి కేటాయిస్తుంటాం..ఆరోజుల్లో ఆ దేవుళ్లను ఆరాధిస్తాము..తమ కోరికలు తీర్చాలని ప్రాధేపడుతుంటాం. ఆ రోజుల్లో దేవుడని పూజించడమే కాకుండా కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. వాటిని గురించి తెలుసుకుని మానుకోవాల్సిన అవసరం ఉంటుంది..

అయితే సోమవారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో ఈ రోజు శివుడిని పూజిస్తారు. అభిషేకం చేసి తమ కోరికలు నెరవేర్చాలని కోరుకుంటారు. శంకరుడి కటాక్షం ఉండాలని ఆశిస్తారు. శివుడిని పూజించే రోజైనా సోమవారం కొన్ని పనులు చేయడం వల్ల మనకు అశుభాలు కలుగుతాయి. జ్యోతిష్య నిపుణుల ప్రకారం సోమవారం ధాన్యం కొనుగోలు చేయకూడదు. విద్యకు సంబంధించిన పుస్తకాలు, పెన్నులు కొనడం కూడా మంచిది కాదు. ఈ విషయాలు గమనించుకుని ప్రవర్తించాలి..

సోమవారం రోజు ఆటవస్తువులు, ఎలక్ర్టిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడం అంత మంచిది కాదు. ఎవరికైనా తెలియకుండా ఇలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే ప్రతికూల ప్రభావాలే ఎదురవుతాయి. కానీ కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని చెబుతుంటారు. అవేంటో తెలుసా? తెల్లటి వస్తువులను తీసుకురావడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. చక్కెర, బియ్యం వంటి వాటిని తెచ్చుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. తెల్లని వస్త్రాలు ధరిస్తే కూడా చంద్ర దోషం పోయి మంచి జరుగుతుంది..

సోమవారం తెల్లని వస్తువులు దానం చేస్తే కూడా శుభమే. శివుడికి అభిషేకించి శివ లింగానికి పాలు పోయడం వల్ల శువుడు ప్రసన్నం చెందుతాడు. శివుడి ఆశీర్వాదం మనకు లభిస్తుంది. శివుడు భోళా శంకరుడు కావడంతో చిన్నపాటి పూజలకే సంతృప్తి చెందుతాడు. సోమవారం శివుడిని ప్రసన్నం చేసుకుంటే మనకు కష్టాలు రావు. చెయ్యాల్సిన పనులను చెయ్యడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news