భక్తి: ఏ రోజు ఏ దేవుడికి పూజిస్తే మంచిదో తెలుసా..?

-

మనకి వారానికి ఏడు రోజులు ఉంటాయి. ఏడు రోజులు కూడా ఒక్కొక్క దేవుడిని పూజిస్తూ ఉంటాం. అయితే ఏ రోజు ఏ దేవుడిని ఆరాధించడం వల్ల మంచి కలుగుతుంది..?, ఎలా ఆరాధించాలి అనే ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఆదివారం:

ఆదివారం అంటే సూర్యునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆరోజు సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అలానే ఆదివారం నాడు సూర్యభగవానుడికి ధాన్యమును సమర్పిస్తే శుభఫలితాలుంటాయి.

సోమవారం:

సోమవారం నాడు చంద్రునికి సంబంధించిన వారం. శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కూడా. సోమవారం నాడు శివుడికి మారేడు, బిల్వ దళాలతో పూజ చేస్తే చేపట్టిన పనులు పూర్తవుతాయి. సిరిసంపదలు కూడా పొందొచ్చు.

మంగళవారం:

మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని దుర్గామాతని పూజిస్తే శుభ ఫలితాలు పొందొచ్చు. ఆంజనేయ స్వామిని తమలపాకుల మాల, వడమాల తో అర్చన చేస్తే భయాలు రోగాలు పోతాయి. అదే ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉంటే కాళీ దేవిని పూజిస్తే మంచిది.

బుధవారం:

బుధవారం వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఎర్రటి మందారాలతో వినాయకుడికి పూజ చేస్తే అనుకున్న పనులు పూర్తవుతాయి.

గురువారం:

గురువారం నాడు గురు గ్రహానికి, సాయిబాబా కి పూజ చేస్తే చక్కటి ఫలితాలు పొందవచ్చు. పాల పదార్థాలతో సాయిబాబాను పూజిస్తే చాలా మంచి కలుగుతుంది.

శుక్రవారం:

శుక్రవారం నాడు మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన రోజు. ఆరోజు తులసి పూజ గోపూజ చేస్తే శుభ ఫలితాలు పొందచ్చు. అలానే అష్టైశ్వర్యాలు కూడా పొందడానికి అవుతుంది.

శనివారం:

శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు. అలానే ఆంజనేయస్వామిని, శనీశ్వరుని కూడా పూజించుకోవచ్చు. ఇలా శనివారం ఈ దేవుళ్ళను పూజిస్తే చాలా మంచి కలుగుతుంది. అలానే ఏ ఇబ్బందులు వుండవు.

Read more RELATED
Recommended to you

Latest news