మనిషి చనిపోతే దహనం, ఖననం చేయటం మనకు తెలుసు..కానీ కొందరు ఏం చేస్తారో తెలుసా?

-

పనికిరాని చెప్పులను కూడా ఇంట్లో ఏదో ఓ మూల పెట్టుకుంటాం కానీ, చనిపోయిన మనిషికి మాత్రం కచ్చితంగా అంత్యక్రియలు నిర్వహిస్తాం. తమ ఆత్మీయులు చనిపోయారనే మోయలేని బాధను తట్టుకుని వారిని తిరిగిరాని లోకాలను ఆచరసంప్రదాయాలు పాటిస్తూ పంపిస్తాం. అయితే ఈ ఆచర, సంప్రదాయాలు కొందిరిలో వేరువేరుగా ఉంటాయి.. కొంతమంది ఖననం చేస్తే మరికొంతమంది దహనం చేస్తారు. ఇది మనకు తెలిసిందే. కానీ కొంతమంది చనిపోయిన వారిని కాకులకు, గద్దలకు వేస్తారట. ఇంకా చాలా చేస్తారట..అవేంటంటే..

1. పక్షులకు ఆహరంగా వేయడం:

పర్సియన్ దేశ ప్రజలు చనిపోయిన వారి దేహాలను పక్షులకు ఆహరంగా వేస్తారట. చనిపోయిన వారి మృతదేహం వృధా అవకుండా ఉండేందుకు వారు ఇలా చేస్తారట. విచిత్రంగా ఉందికదూ.

2. నది/సముద్రాల్లో వదిలివేయడం:

మనం దహనం లేదా, సమాధి కట్టినట్లు.. దక్షిణ అమెరికాలో ప్రజలు మృతదేహాలను పారుతున్న నదీజలాల్లో, లేదా సముద్రాలలో వదిలేస్తారట..

3. శవాలను తినడం:

ఇది మరీ వింత గా అనిపిస్తున్నా.. ఒకప్పుడు ఈ సంప్రదాయం న్యూగినియా మరియు బ్రెజిల్ దేశాల్లో ఉండేదట. ఎవరైనా చనిపోతే.. వారి శవాన్ని ముక్కలు ముక్కలు గా చేసుకుని భుజిస్తారట. వామ్మో ఇలా ఎలా చేశార్రాబాబు అనిపిస్తుంది కదా..తలుచుకుంటునే చాలా భయంకరంగా ఉంది.

4. గుహల్లో ఉంచడం:

ఇజ్రాయిల్ , ఇరాక్ వంటి దేశాల్లో ఎవరైనా చనిపోతే.. వారి శవాలను ఊరి చివరన ఉండే గుహల్లో వదిలేస్తారట. శవాలను ఉంచడం కోసం వారు పెద్ద పెద్ద రాళ్లను కూడా ఉపయోగిస్తారట. ఇది వారి ఆచారం.

5. కొండ అంచున ఉరితీయడం:

ఈ సంప్రదాయం ఎక్కువగా చైనాలో ఉంది. చనిపోయిన వారి శవాలను వీరు కొండ రాళ్ల మధ్య, లేదా కొండల అంచున పెట్టెల్లో పెట్టి ఉరి తీసారట. ఇలా చేస్తే వారు స్వర్గానికి చేరుకుంటారని వారి నమ్మకం.

6. మమ్మీలు:

మమ్మీలు అనగానే మనకి ముందు గుర్తుకు వచ్చేది ఈజిప్టు. అక్కడ ఎవరైనా చనిపోతే.. వారిని గుడ్డలతో చుట్టి పెట్టెల్లో బంధిస్తారు. ఇలా.. చేస్తే చనిపోయిన వారు ఎప్పటికైనా తిరిగి వస్తారని వారి విశ్వాసం. చైనా, శ్రీలంక, టిబెట్, థాయిలాండ్, భారత్ లో కొన్ని ప్రదేశాల్లో కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.

ఇలా వివిధరకాలుగా చేస్తుంటారు. ఏ సంప్రదాయాన్ని మనం తప్పుపట్టలేము. అది వారి విశ్వాసం.

– Triveni Buskarothu

Read more RELATED
Recommended to you

Latest news