ఈ మాసంలో శివుడు ఏ క్షేత్రంలో కొలువై ఉంటాడో తెలుసా?

-

శ్రావణమాసం చాలా ప్రత్యేకమైన మాసం..ఈ మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు.ఈ మాసంలో ఎన్నో ప్రత్యేక పండుగలు కూడా ఉన్నాయి.దేవశయని ఏకాదశి అంటే దేవతల నిద్రా కాలం ప్రారంభం. శివ పురాణం ప్రకారం, విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు, ప్రపంచ నియంత్రణ శివుని చేతిలో ఉంటుంది.

చాతుర్మాస నాలుగు మాసాలలో, సృష్టి యొక్క మొత్తం బాధ్యతను శివుడు చూసుకుంటాడు. శ్రావణ మాసం 29 జూలై 2022 నుండి ప్రారంభమైంది. శివుడు కైలాసాన్ని విడిచిపెట్టి ఈ సమయంలో భూమికి వస్తాడని. ఇక్కడ నుండి విశ్వాన్ని పరిపాలిస్తాడని నమ్ముతారు. శ్రావణ మాసంలో శివుడు భూమ్మీద ఏ ప్రదేశంలో కొలువై ఉంటాడో తెలుసా?..అదే అండీ ఈ మాసం లో కుటుంబం తో సహా తన అత్తగారిళ్లు అయిన హరిద్వార్‌లోని కంఖాల్‌లో ఉంటారు.

ఇక్కడి దక్ష దేవాలయంలో శివుడు, సతీదేవి వివాహం చేసుకున్నారని ప్రతీతి.శివ పురాణం ప్రకారం, సతి తండ్రి దక్ష ప్రజాపతి కంఖల్ వద్ద ఒక ప్రసిద్ధ యాగాన్ని నిర్వహించాడు. సతీదేవి తండ్రికి మహాదేవునిపై కోపం రావడంతో ఈ యాగానికి తన అల్లుడు శివుడుని ఆహ్వానించలేదు. ఇక్కడే సతీదేవి తన తండ్రి శివుడిని అవమానించినందుకు యాగంలో తన ప్రాణాలను బలితీసుకుంది. నిప్పులు కురిపిస్తున్న సతీదేవిని చూసి, దుఃఖంలో మునిగిపోయిన శివుడు తన ఝటాఝూటాన్ని నేలకేసి కొట్టాడు. అప్పుడే ఉగ్రరూపమైన శివ స్వరూపుడైన వీరభద్రుడు అవతరించాడు. అతడు సతీదేవి తండ్రి అయిన దక్షుడి తలను నరికివేసాడు..

ఆ తర్వాత దేవతల కోరిక మేరకు మేక తల పెట్టి దక్ష రాజుకు శివుడు పునర్జన్మ ఇస్తాడు. దక్ష ప్రజాపతి తన అహంకారానికి క్షమాపణ చెప్పి, ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో శివుడిని ఇక్కడే ఉండి, తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుని నుండి వాగ్దానం పొందాడు. అప్పటి నుండి శ్రావణ మాసం వచ్చినప్పుడు శివుడు భూలోకానికి వస్తాడని మరియు ప్రపంచాన్ని పరిపాలిస్తాడని నమ్ముతారు. శ్రావణ మాసం అంతా దక్షేశ్వరుని రూపంలో శివుడు కంఖాల్‌లో ఉంటాడు. ఈ కారణంగానే శ్రావణ మాసంలో శివుడి ఆరధానకు ప్రాముఖ్యత ఉంది..చాలా మందికి ఈ విషయం తెలియదు..మీరు కూడా శివుడిని ప్రసన్నం చేసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news