తిరుమల శ్రీవారి గురించి ఎన్నో తెలియని విశేషాలు ..!

-

ప్రపంచ ప్రసిద్ధి కెక్కిన తిరుమల తిరుపతి దేవస్థానం లో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. తిరుపతి లోని శ్రీవారిని నిత్యం ఎంతో మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామి వారికి సుమారుగా పదకొండు టన్నుల ఆభరణాలు ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి .స్వామి  వారికి నిత్యం చేసే అభిషేకాలలో వాడే నెయ్యి, పాలు, పూలు, ఆకులు, వెన్న వంటివి రహస్యం గా ఉన్న ఒక చిన్న గ్రామం నుండి తెస్తారు. ఆ గ్రామ ప్రజలందరూ ఎంతో నిష్టగా ఉంటారు. సామాన్యులకు ఆ గ్రామంలోకి ప్రవేశం లేదు. ఆ గ్రామం ఆలయం నుంచి 22 కి మీ దూరంలో ఉంది.

స్వామి వారి విగ్రహానికి ఎప్పుడు చెమటలు పడతాయి అని పురాణాలూ చెప్తున్నాయి . స్వామి విగ్రహం వెనుక భాగాన సముద్ర హోరు వినపడుతుంది. స్వామి వారికి కింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. స్వామి వారి అలంకరణకు వాడిన పూలు ఎవ్వరికి ఇవ్వరు. స్వామి వారి వెనుక భాగాన వెనక్కి చూడకుండా విసిరేస్తారు.చిత్రం ఏమిటంటే ఆ పూలు ఆలయానికి 20 కి మి దూరంలో ఉండే వేర్పేడులో తేలతాయి. స్వామి వారి వెనుక ఉన్న జల పాతం ద్వారా అక్కడకు చేరతాయి.స్వామి వారు బాలుని రూపంలో ఉన్నప్పుడు అనంతాల్వారు గునపంతో కొడతాడు. దానితో స్వామి వారి గడ్డానికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది. ఇక అప్పటి నుండి గడ్డానికి గంధం రాసే అలవాటు ప్రారంభమైనది.

అలాగే స్వామి వారి వక్ష స్థలం పై లక్ష్మి దేవి ఉంటుంది అనటానికి ఆధారాలు ఉన్నాయి. స్వామి నిజ రూప దర్శన సమయంలో చందనాన్ని తొలగించేటప్పుడు లక్ష్మి దేవి బొమ్మ అచ్చులాగా వస్తుంది. స్వామి వారి గుడిలో మట్టితో చేసిన ప్రమిదల్లోని దీపాలు ఎప్పుడు కొండ ఎక్కవు. వీటిని అసలు ఎప్పుడు వెలిగించారో కూడా తెలియదు.ఆ గుడిలో ఉన్న మరో విశేషం ఏమిటంటే గర్భ గుడిలో విగ్రహం గుడి మద్యలో కాకుండా ఓ పక్కగా ఉంటుంది. పరీక్షగా చూస్తేనే అది అర్ధమౌతుంది.ఇలా తిరుమల శ్రీవారి గురించి ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news