భక్తి: ఈ శరీర భాగాలపై బల్లి పడితే మంచిదే…!

-

మన మీద బల్లి పడితే మంచిది కాదని చాలా మంది అంటూ ఉంటారు.  బల్లి పడిన వెంటనే స్నానం చేస్తే దాని వల్ల ఎటువంటి హాని కలగదని అంటుంటారు పెద్దలు. అయితే కొన్ని కొన్ని సార్లు బల్లి మన మీద పడటం కూడా మంచిదని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఈ శరీర భాగాల్లో బల్లి పడటం వల్ల శుభం కలుగుతుందని మంచి జరుగుతుందని అన్నారు. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూద్దాం.

ఈ శరీర భాగాల్లో బల్లి పడితే ధనం, గౌరవం వుంటాయని అంటున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు బల్లి పడటం వల్ల మరణానికి కూడా సంకేతమని.. గొడవలు అవుతాయని.. స్నేహితులు విడిపోతారు మొదలైన వాటిని కూడా సూచిస్తుంది.

తినేటప్పుడు బల్లి వాయిస్ వినపడితే శుభం కలుగుతుంది.
బల్లి కనుక నుదుటి మీద పడితే అది చాలా మంచి సంకేతం అని అంటున్నారు. ప్రాపర్టీ రావడానికి కూడా అది సంకేతం అని పండితుల చెప్పడం జరిగింది.
బల్లి ముక్కు మీద పడితే అది అదృష్టానికి సంకేతము.
బల్లి కనుక ముఖం మీద పడితే రుచికరమైన భోజనం ఉన్నట్లు సంకేతం.
ఎడమ బుగ్గ మీద బల్లి పడితే పాత స్నేహితుడిని కలుసుకుంటారు.
మెడ మీద పడితే గౌరవం పెరుగుతుంది.
అదే కుడి చేతి మీద బల్లి పడితే ధనం వస్తుంది.
కుడి పాదం మీద బల్లి పడితే ప్రయాణం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version