శుక్రవారం మీన సంక్రాంతి.. ఈ చిన్న పరిహారం చేయండి మీ ప్రయత్నాలు సఫలం!

-

ఈ సమయంలో గోధుమలను (ముందే నానబెట్టుకోవాలి) ఆ సమయాల్లో సూర్యనారాయణస్వామికి నమస్కారం చేసి నాలుగు నుంచి పది గింజలను ప్రసాదంగా నోట్లోవేసుకోండి.

భారతీయ ఖగోళ, జ్యోతిష శాస్ర్తాలు చాలా కచ్చితమైనవి, అపూర్వమైనవి. ఈ లెక్కల ఆధారంగా ఎన్నో విశ్వరహస్యాలను మనవారు చేధించారు. కాలాన్ని విభజించడంలో మనవారికి మనవారే సాటి. సౌరమానం ప్రకారం ప్రతి నెలలో సంక్రాంతి వస్తుంది. మార్చి 15 శుక్రవారం రవి అంటే సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ప్రతి నెల ఒకరాశిలో ప్రవేశిస్తు ఉంటాడు. అయితే వీటిలో మకర, కర్కాటక సంక్రాంతిలను మనవారు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

మార్చి 15 మహాసౌర మీన సంక్రాంతి- ఈ రోజు సంక్రాంతితో పాటు మహాసౌరం కలిసి రావడం విశేషం. మహాసౌరం అంటే రవి ఉన్న నక్షత్రం/రాశి నుంచి 4,6,9,10,13,20 స్థానాల్లో చంద్రుడు ఉంటే మహాసౌరయోగం అంటారు. అదేవిధంగా సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించడం రెండూ కలిసి ఒకరోజు రావడంతో చాలా అరుదు. ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీనివాస గార్గేయ, హెచ్‌ఆర్ శాస్త్రి, జేవీఎస్ శాస్త్రి వంటి వారు దీని గురించి పేర్కొన్నారు.

ఈ రోజు ఏం చేయాలి?

– ఉదయం 9.45 నిమిషాల నుంచి 11.30 మధ్య లేదా మధ్యాహ్నం 2.30 నుంచి 3.45 మధ్యలో సమయం అత్యంత శుభసమయం.

-ఈ సమయంలో గోధుమలను (ముందే నానబెట్టుకోవాలి) ఆ సమయాల్లో సూర్యనారాయణస్వామికి నమస్కారం చేసి నాలుగు నుంచి పది గింజలను ప్రసాదంగా నోట్లోవేసుకోండి. సూర్యనారాయణుడి అనుగ్రహం వల్ల మీ ప్రయత్నకార్యాలు సఫలీకఋతం అవుతాయి.

– కొత్తగా ప్రయత్నాలు ప్రారంభించినా, చేస్తున్న పనుల అయినా సరే మీకు అనుకూలంగా మారుతాయి. ఈ సమయంలో ఆయా పనుల గురించి దైవానికి నమస్కారం చేసుకుని మంచి ఆలోచన చేయండి. అంతే మీకు మంచి జరుగుతుంది.

– ఈసమయంలో ఓం సూర్యనారాయనాయనమః అని ధ్యానాన్ని మనస్సులో చేసుకోండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version