ఉడుత రూపంలో హనుమంతుడు..ఈ దేవాలయ రహస్యం తెలిస్తే అస్సలు నమ్మలేరు..

-

సాధారణంగా హనుమంతుడు రూపం మారుతి.. అయితే ఇప్పుడు చెప్పుకొనే ఆలయం చాలా ప్రసిద్ధమైంది.. అక్కడ ఆంజనేయ స్వామి తన రూపంలో కాకుండా ఉడుత రూపంలో ఉంటాడు.. హనుమంతుడు ఉడత రూపంలో పూజలను అందుకుంటున్నా దేవాలయం ఒకటి ఉందని చాలామందికి తెలియదు. అయితే అలీఘర్లోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో హనుమంతుడు ఉడత రూపంలో ఉంటాడు. ఈ దేవాలయమును సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు.ఇప్పుడు హనుమాన్ దేవాలయం గురించి తెలుసుకుందాం..

భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందిన అలీఘర్లోని అచల్ సరోవర్ ఒడ్డున హనుమంతుడి దేవాలయం ఉంది..ఇక్కడ విగ్రహం ఉన్నదనే విషయాన్ని సాధువు గిల్హారాజ్ శ్రీ మహేంద్రనాథ్ యోగి జీ మహారాజ్ గుర్తించారు. ఈ దేవాలయంలో శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడు పూజలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అంటే ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెబుతున్నారు.. మహేంద్ర నాథ్ యోగి అనే మహర్షి కలలో ఆయన ఉడుత రూపంలో ఆంజనేయ స్వామిని పూజించినట్లు చరిత్ర చెబుతుంది..

ఆ తర్వాత ఇక్కడ ఈ దేవాలయం నిర్మించారు. ప్రపంచంలోనే ఏకైక దేవాలయం ఉడుతా హనుమాన్ దేవాలయం అని భక్తులు నమ్ముతారు. మామూలుగా ఎక్కడైనా సరే హనుమంతుడి పూజిస్తే ఆ భక్తుల కష్టాలు తొలగి హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అయితే ఈ ఉడత హనుమాన్ దేవాలయం అలా ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు. ఈ దేవాలయంలో 41 రోజులపాటు పూజలు చేసిన వారి అన్నీ కష్టాలు దూరమైపోతాయని చెబుతున్నారు.ఈ దేవాలయంలో ప్రతిరోజు చాలామంది భక్తులు బజరంగబలికి రకరకాల నైవేద్యాలతో ప్రసాదాలను పెడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version