గాలిలో వేలాడే స్తంభం ఉన్న దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి..అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి ఎంతో చారిత్రక చరిత్ర ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్న వీరభద్రాలయంలోని మండపానికి చెందిన ఓ స్తంభం గాల్లో తేలాడుతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీని వెనక రహస్యాన్ని ఛేదించేందుకు ఎంతో మంది విఫల యత్నం చేశారు.. కానీ అసలు విషయాన్ని కనుక్కోలేక పోయారు.. ఆ దేవాలయ రహస్యం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

మనదేశంలో ఎన్నో విచిత్రాలు నెలకొని ఉన్నాయి. వేల సంవత్సరాల పాటు రాజుల పరిపాలనలో అమూల్యమైన సంపద మన దేవాలయాల్లో నిక్షిప్తం చేసి ఉంచారు. అంతేకాకుండా అప్పటి రాజులు నిర్మించిన ఆలయాలు ఎంతో విచిత్రంగానూ, సాంకేతికంగా సవాల్ చేసే విధంగా ఉంటాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. వాటిలో గాలిలో తేలుతూ ఉండే స్తంభమున్న ఆలయం ఒకటి ప్రధానంగా ఆకర్షిస్తుంది. ఆ దేవాలయం కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అనంతపురం జిల్లాలో లేపాక్షికి సమీపంలో ఉన్న వీరభద్ర స్వామి దేవాలయం విచిత్రమైన నిర్మాణశైలితో ఉండి భక్తులను ఆకర్షిస్తోంది..

 

ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది.. ఇది క్రీ.శ. 16వ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. మహా శివుడు, విష్ణుమూర్తి, వీరభద్ర స్వామిని ఇక్కడ కొలుస్తుంటారు. లేపాక్షి వీరభద్రుని ఆలయంలోని నాట్యమండపాన్ని దాదాపు 70 స్తంభాలతో నిర్మించారు. సాధారణంగా స్తంభాలు నేలను తాకుతూ పైకప్పుకు ఆధారంగా ఉంటాయి. కానీ ఈ దేవాలయంలో ఉన్న ఓ స్తంభం మాత్రం నేలకు కొంచెం ఎత్తులో గాలిలో తేలుతూ ఉండే విధంగా నిర్మించారు.అంత బరువు కలిగిన ఆ స్తంభం గాలిలో ఎలా ఉంటుంది అనే విషయం పై ఎందరో ప్రయోగాలు చేశారు.. కానీ కనుక్కోలేక పోయారు..

 

ఈ ఆలయంలో ఉన్న 69 స్తంబాలు మాములుగా ఉంటే,ఒక స్తంభం మాత్రం గాలిలో వేలాడుతూ కనిపిస్తుంది.గాలిలో ఉన్న స్తంభాన్ని కిందకు ఆనించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అంతే స్తంభం పైకప్పుక ఆధారంగా ఉన్న శీర్షాలన్నీ కదిలాయి. అంతేకాకుండా దీంతో పాటు పక్కనున్న మరికొన్ని స్తంభాలు వాటి దిశను మార్చుకున్నాయి. నాట్య మండపం మధ్యలో ఉన్న భృంగీశ్వరుడు భిక్షాటన మూర్తి ఉన్న స్థంబాలు పై భాగాలు బాగా దగ్గరకు వచ్చాయి. దీంతో ఈ ఇంజనీరు ఈ స్థంభం మొత్తమే ఈ మండప భారాన్ని మోస్తుందని భావించి దాన్ని అలాగే వదిలేశాడు..

ఇకపోతే శివుడి రౌద్రావతరమైన వీరభద్రుడి రూపంలో ఉన్న స్వయంభు శివలింగం ఇక్కడ ఉంది. కొన్ని వృత్తాంతాల ప్రకారం.. 15వ శతాబ్దం వరకు ఈ శివలింగం ఉనికిలో ఉంది. అంటే శివలింగానికి పైకప్పు లేదని అర్థమవుతుంది. ఈ ఆలయాన్ని 1538 లో విజయనగర రాజు దగ్గర కలిసి పనిచేస్తున్న విరుపన్న, వీరన్న అనే ఇద్దరు సోదరులు నిర్మించినట్లు చెబుతారు. కొన్ని ఇతిహాసాల ప్రకారం, అగస్త్య మహాముని అదే సమయంలో లేపాక్షి ఆలయ సముదాయంలో వీరభద్ర ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతుంది..

సీతను రావణుడు ఎత్తుకెల్లె సమయంలో ఓ పక్షి అడ్డుకుంటుంది.రావణుడితో భీకరంగా పోరాడిన జటాయువు తీవ్రంగా గాయపడుతుంది. అది ఎగురుతూ ఆకాశం నుంచి ఈ ప్రదేశంలో పడిపోయింది. అనంతరం సీతను వెతుక్కుంటూ అదే మార్గంలో వస్తున్న రాముడు జటాయువును చూస్తాడు. పక్షిని చూసి చలించిన రాముడు ‘లే.. పక్షి’ అని సంబోధిస్తాడు..అప్పటి నుంచి లేపాక్షి అని పేరు వచ్చింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version