భక్తి: శ్రీ చక్రాన్ని పూజించడం వలన ఎంత మంచి జరుగుతుందంటే..?

-

శ్రీ చక్రం ఎంతో మహిమగలది. శ్రీ చక్రం ఇంట్లో ఉండడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ శక్తివంతమైన శ్రీ చక్రం ఇంట్లో ఉండడం వల్ల చెడుకు, కీడు చేసే శక్తులకు దూరంగా ఉండవచ్చు. దాంతో సంపదను కూడా పొందడానికి వీలవుతుది. కానీ పంచ లోహాల తో చేసిన శ్రీచక్రం ఇంట్లో ఉండకూడదు. శ్రీ చక్రం యంత్ర రూపం లో రాగి రేకు పై చెక్కిన రేఖ లాగ మాత్రాన ఉండాలి. దాన్ని మాత్రమే పూజా మందిరం లో ఉంచాలి. ప్రతి రోజు కుంకుమ మరియు పువ్వులతో పూజించి, నమస్కారం చేసుకోవాలి.

ప్రతి శుక్రవారం ఆవు పాల తో పూజించి ఆ తర్వాత నీళ్ల తో శుద్ధి చేసుకోవాలి. అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటూ గంధం, కుంకుమ మరియు అక్షింతల తో పూజ చేయాలి. శ్రీ చక్రం అన్ని కోరికలను తీరుస్తుంది మరియు ఎటువంటి ఆపద వచ్చినా వాటి నుండి బయటకు తెస్తుంది. ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా వృద్ధి చెందడానికి శ్రీ చక్రం ఎంత గానో ఉపయోగ పడుతుంది.

శక్తి గల యంత్రాల లో శ్రీ చక్రం ఒకటి కాబట్టి దీనిని పూజగది లో ఉంచుకుని తప్పకుండా భక్తి శ్రద్ధల తో పూజించాలి. శ్రీ చక్రాన్ని పూజ గది లో మాత్రమే కాదు, పని చేసే కార్యాలయం లో కూడా పెట్ట వచ్చు. కానీ శుభ్రమైన ప్రదేశం లోనే పెట్ట వలెను మరియు పూజించవలెను. ఇలా చేస్తే మంచి కలుగుతుంది కనుక తప్పక అనుసరించండి. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news