దేవుని గదిలో ఎన్ని దీపాలు ఉండాలి?

-

ప్రతి ఒక్కరి ఇంట్లో సాధారణంగా దేవుని గది లేదా భువనేశ్వరం (దేవుని విగ్రహాలు లేదా ఫొటోలు లేదా ప్రతిమలు ఉంచుకునే ఒక కర్ర/మార్బుల్‌తో చేసినది)లో లేదా ఈశాన్య మూల ఉన్న చిన్న దేవుని పటాలు/ప్రతిమల దగ్గర ప్రతిరోజు ఎలా దీపారాధన చేయాలి అనే విషయంపై చాలామందికి అనేక సందేహాలు.. అయితే వాటికి శాస్త్రం, పండితులు చెప్పిన విధానాలు తెలుసుకుందాం…

ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా ప్రతిరోజు చేయాలి. ఎన్ని దీపాలు పెట్టాలి అంటే ఒకే ప్రమిదలో మూడువత్తులు వేసి దీపాన్ని వెలిగించవచ్చు. అవకాశం ఉంటే దేవుని రూపాలు/ప్రతిమలకు రెండు పక్కల రెండు దీపాలను పెట్టవచ్చు. ప్రతి దాంటో మూడు వత్తులను కలపి ఒకటిగా చేసి లేదా ఒక్కొక్కటి చొప్పునైనా వెలింగచవచ్చు.

How many deepalu should be kept in Pooja room

– దీపం ఏ దిశకు పెట్టాలి అనేది మరో సందేహం. దీపం దేవునికి ఎదురుగా కుడిపక్కకు అంటే మన కుడిపక్కకు లేదా దేవుని మంటపంలో ఆగ్నేయ భాగంలో పెట్టాలి. బొడ్డుత్తులైతే ఏ సమస్య ఉండదు.
– దీపపు సెమ్మలో మధ్యలో వత్తి పైకి చూసే విధంగా ఉంటే దిక్కులతో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
– రెండు దీపాలు పెడితే ఒకదానిని మరొకటి చూసే విధంగా పెట్టాలి.
– ఒక్కటే పెడితే తూర్పు లేదా ఉత్తరం లేదా పశ్చిమం చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి.
– నాలుగు పక్కలా నాలుగు దీపాలు పెడితే మరీ శ్రేష్ఠం. కానీ ఇంట్లో స్థలం, నూనె, ఆర్థిక పరిస్థితులను చూసుకుని పెట్టాలి.

How many deepalu should be kept in Pooja room

– ఎన్ని వత్తులు వేయాలి అనేదానికి పెద్ద పట్టింపులు లేవు కానీ ఒక్కటి కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ అయితే మంచిదిని పెద్దల ఉవాచ.
– మంత్రం ప్రకారం చూస్తే.. సాజ్యం త్రివర్తి సంయుక్తం… అని అంటే మూడు వత్తులను ఏకం చేసి ఒకటిగా వెలిగిస్తే మంచిది.
– దీపారాధనకు ఆవునెయ్యితో శ్రేష్ఠం, అదీకాకపోతే నువ్వుల నూనె, ఇప్పనూనె, కొబ్బరినూనె, కుసుమనూనె, లేదా అందుబాటులో ఉన్న ఏదైనా నూనెతో వెలిగించండి. భక్తి, శ్రద్ధతో ఏ విధమైన దీపాన్ని పెట్టినా శుభమే.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news