కార్తీక పౌర్ణమి స్నానం ఎలా చెయ్యాలి?

-


కార్తీకమాసం విశిష్టత తెలియనివారు ఉండరు. జన్మజన్మల్లో చేసిన పాపాలను, దోషాలను పోగొట్టుకోవడానికి అత్యంత సులభమైన మాసం కార్తీకం. ఈ మాసంలో చేసే స్నానం, దీపారాధన, పూజలు ప్రతి ఒక్కటి ప్రత్యేకం. అయితే వీటన్నింటి కంటే అత్యంత ముఖ్యమైనది కార్తీక పౌర్ణమి. ఈ మాసానికి కార్తీకం అని రావడానికి కారణం. కృత్తిక నక్షత్రంలో పౌర్ణమిరావడమే ప్రధానకారణం. ఈ రోజును చేసే ప్రతి పని చాలా ప్రాముఖ్యత కలిగినవి.

స్నానం ఎలా చేయాలి..?
ప్రతిరోజులాగానే బ్రాహ్మీముహుర్తంలో అంటే సూర్యోదయానికి పూర్వమేలేచి స్నానం ఆచరించాలి. అయితే ఈ రోజు స్నానం చేసేటప్పుడు ఉసిరిక చూర్ణంతో స్నానం చేయడం ఉత్తమం. ఉసిరికాయను రంగరించి లేదా లేపనంగా చేసుకొని స్నానం చేయడం వల్ల చర్మం సున్నితం కావడమే కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఈ రోజు స్నానానంతరం దేవుని సన్నిధానంలో దీపారాధన, తులసి, ఉసరి చెట్లవద్ద దీపారాధన తప్పనిసరిగా చేయాలి. అమలకం అంటే ఉసిరితో స్నానం చేయడం వల్ల పాపాలు హరిస్తాయని పురాణ ప్రశస్తి. పౌర్ణమినాడు అందరూ ఉసరికాయతో స్నానం చేయండి. పరమేశ్వరుని ఆరాధించండి. వీలున్నవారు సమీపంలోని నదులు, సరస్సులు, చెరువులు, కాలువల వద్ద స్నానాలు చేసి నదుల్లో కార్తీక దీపాలను వదిలితే మరీ విశేషం. అవకాశం లేనివారు ఇంట్లోనైనా పవిత్రమైన గంగా, యమునా, కృష్ణా, గోదావరి నదుల పేర్లను ఉచ్చరించుకుంటూ స్నానం ఆచరించండి. నదీస్నాన ఫలితాలను పొందుతారు.

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

Read more RELATED
Recommended to you

Exit mobile version