సూర్యుడిని ఏ మాసంలో ఏ నామంతో పూజించాలో తెలుసా !

-

సూర్యుడు మనకు కన్పించే ప్రతక్ష్య దైవం. ఆయన ఆరాధన గురించి ప్రత్యేక శాస్త్రాలు ఉన్నాయి. నేటి ఆధునిక శాస్త్రవేత్తలు కనిపెట్టని అంశాలను మన పూర్వీకులు చెప్పడం విశేషం. దీనికి ఉదాహరణ భూమికి సూర్యుడికి మధ్య దూరం లెక్క. ఇక మన అనేక పురాణాల్లో, సూర్యోపాసన విధానం గురించిన వివరాలెన్నో లభిస్తున్నాయి. భవిష్య పురాణంలో మాంధాత రాజు సూర్య వ్రతాన్ని గురించి తమ కులగురువు వశిష్టులవారిని అడిగినప్పుడు, వారీ వివరాలు చేప్పాడు. మాఘమాస సూర్య (ఆది) వారం నాడు, ‘వరుణాయ నమ : ‘ అనుకుంటూ సూర్యారాధన చేయాలి. ఫాల్గుణ మాసంలో ‘సూర్యాయ నమః ‘ అని సూర్యుణ్ణి పూజించాలి.

చైత్ర మాసంలో ‘భానవే నమ : ,’ వైశాఖ మాసంలో ‘తపనాయ నమ : ‘, జ్యేష్ట మాసం లో ‘ఇంద్రాయ నమ : ‘, ఆషాఢ మాసం లో ‘రవయే నమ : ‘, శ్రావణ మాసంలో ‘గభష్తయే నమ : ‘, భాద్ర పద మాసంలో ‘యమాయ నమ : ‘, అశ్వయుజ మాసం లో ‘హిరణ్య రేతసే నమ : ‘, కార్తిక మాసం లో ‘దివాకరాయ నమః, మార్గ శిర మాసంలో ‘మిత్రాయ నమః, పౌష్య మాసంలో ‘విష్ణవే నమః’ ..ఈ విధంగా వివిధ మాసాలలో, వివిధ నామాలూ, వివిధ నైవేద్యాలతో సూర్య వ్రతం చేసిన తరువాత, ఉద్యాపన కూడా చేయాలి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version