సలేశ్వరానికి ఎలా వెళ్లాలి..?

-


నలమల్ల కీకారణ్యంలో వెలసిన లింగమయ్య సలేశ్వర ఉత్సవాలకు వెళ్లేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. – హైదరాబాద్ నుంచి వచ్చేవారు 130కి.మీ, ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రం నుంచి 100కిలో మీటర్లు, నల్లగొండ జిల్లా నుంచి 150 కి.మీ. దూరం ప్రయాణం చేసిన తరువాత నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ గ్రామానికి చేరుకోవాలి. అక్కడనుండి శ్రీశైలం- హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారి మీదుగా మన్ననూర్ నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న ఫరహాబాద్ చౌర-స్తాకు చేరుకోవాలి. అక్కడ నుంచి పూర్తిగా దట్ట-మైన అడవుల్లో ఉన్న సలేశ్వరం వెళ్లే మార్గంలో 30 కి.మీ.దూరంలో ఉన్న రాంపూర్ పెంటకు చేరుకొని అక్కడి నుంచి మరో 2 కి.మీ. దూరం ఆటోల ద్వారా వెళ్తే ప్రధాన మార్గం వస్తుంది. ఇక్కడి నుంచి 3 కి.మీ. దూరం కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడి వద్దకు సాహసయాత్ర చేయాల్సి ఉంటుంది.
2.రెండో మార్గం నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అప్పాయిపల్లి గ్రామం మీదుగా కాలి-నడకతో పాటు ట్రాక్టర్ల ద్వారా కొండల, గుట్టల పైనుంచి సాహసంగా సలేశ్వరం చేరుకోవాలి.

టోల్‌గేట్‌లు ఉన్నాయి…!

సలేశ్వరం జాతరకు వచ్చే వేలాది వాహనాలకు అట-వీశాఖ ఐదారు సంవత్సరాలుగా టోల్‌గేట్ వసూలు చేస్తుంది. ద్విచక్ర వాహనాల నుంచి అన్ని రకాల వాహనాలు మరియు ఆర్టీసీ బస్సులకు సైతం ఇలా రూ.50-200 వరకు వసూలు చేయడంతో ప్రతి ఏటా సుమారు పది లక్షల ఆదాయం సమకూరుతుంది. వాహనాలలో వచ్చేవారు టోల్ లెక్కలేసుకుని వస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version