గురువారం నాడు ఇలా పూజ చేస్తే శుభం కలుగుతుంది..!

-

ప్రతి రోజు పూజ చేయడం వల్ల మనం ఎంతో ఆనందంగా ఉండొచ్చు. భగవంతుడి ఆశీస్సులు ఉంటే ఏదైనా మనం చేయగలం. అయితే గురువారం నాడు ఎలా పూజ చేయాలి..?, ఎలా పూజ చేయడం వల్ల శుభం కలుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. చాలా మంది గురువారం నాడు ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. అలానే పూజ చేసి మంచి కలగాలని కోరుకుంటారు.

కొందరు అయితే ఉపవాసం చేయాలని అనుకుంటూ ఉంటారు. గురువారం నాడు నిజంగా ఉపవాసం చేయడం చాలా మంచిదని… ఉపవాసం చేసి భగవంతుడిని పూజించడం వల్ల మన ధ్యాస మొత్తం భగవంతుడి మీద పెట్టి శుభ ఫలితాలను పొందవచ్చు అని నమ్మకం. అయితే గురువారం నాడు ఎలా పూజ చేయాలి, ఎటువంటి పద్ధతులు అనుసరించాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గురువారం అంటే గురు గ్రహం లేదా బృహస్పతికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు గుడికి వెళ్లి పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అనుకున్నవి జరుగుతాయి కూడా. గురువారం నాడు గురునికి నెయ్యి అభిషేకం చేయాలి. అదేవిధంగా గురువుకి ఇష్టమైన పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే మంచిది.

అలానే పసుపుతో అభిషేకం చేసి శనగలుని నైవేద్యంగా సమర్పించాలి. కొందరు అయితే కొద్దిగా శనగలుని పసుపు రంగు వస్త్రంలో కట్టి స్వామివారికి సమర్పిస్తారు. ఈ విధంగా కనుక అనుసరించారు అంటే కచ్చితంగా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అదే విధంగా ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. గురువారం నాడు నిజంగా ఉపవాస దీక్ష చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆ రోజు ఉప్పుతో కలిగిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అలానే స్వామి వారి కథ వినడం కూడా మంచిదే. కధ వినడం లేదా చదవడం తో ఉపవాస దీక్ష విరమించాలి.

Read more RELATED
Recommended to you

Latest news