బాలీవుడ్: లైంగిక ప్రతిపాదనలు నా వరకు రాకపోవడానికి అదే కారణం.. మల్లికా షెరావత్

బాలీవుడ్ నటి మల్లికా షెరావత్, లైంగిక ప్రతిపాదనలపై చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. బాలీవుడ్ సినిమాల్లో సెగలు పుట్టించిన మల్లికా షెరావత్, లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారా అన్న నేపథ్యంలో అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. బాలీవుడ్ బబుల్ తో జరిపిన ఇంటర్వ్యూలో ఈ సమాధానాలు ఇచ్చారు. లైంగిక ప్రతిపాదనలు మీ వరకు వచ్చాయా? వాటిపట్ల మీ స్పందన ఎలా ఉండింది అన్న ప్రశ్నకు జవాబు ఇచ్చిన మల్లికా, నేను సినిమాల్లో చేసిన పాత్రల కారణంగా నన్ను అడగడానికి భయపడేవారేమో!

నా వరకు పెద్దగా లైంగిక ప్రతిపాదనలు రాలేదు. పూర్తిగా రాలేదని కాదు కానీ కొంతవరకు నేను కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ నా ముక్కుసూటితనం కారణంగా నేను ఇబ్బంది పడలేదు. అదీగాక ఎవరైనా మరీ చనువుగా ఉంటున్నారంటే నేనే దూరం వెళ్ళిపోతాను. ఇంకా, అర్థరాత్రుళ్ళు కథా చర్చలని హోటల్ గదుల్లో బస చేయడం కానీ, బాలీవుడ్ పార్టీలకు వెళ్ళడం కానీ చేయలేదు. అందువల్ల అలాంటి ఇబ్బందులు నాకు తలెత్తలేదని మల్లికా షెరావత్ పేర్కొంది.