నెలలో ఒక్క మంగళవారం ఇలా చేస్తే..మీ కోరికలు వెంటనే తీరతాయి..

-

హిందూధర్మం ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.. ఒక్కో వారం కొంతమందికి ప్రత్యేకం..ఆ రోజున వారికి అంతా మంచే జరగాలని వారికి ఇష్టమైన భగవంతుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు. మరి కొంత మంది ఇంట్లోనే దేవుడిని పూజిస్తూ ఉంటారు.. చాలా మంది మంగళవారాన్ని ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు.. మంగళవారం రోజున ముఖ్యంగా ఆంజనేయస్వామిని ఎక్కువ గా ఆరాధిస్తూ ఉంటారు. అయితే మంగళవారం కొన్ని రకాల పద్ధతులను పాటించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు.. ఇక ఆ పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మంగళవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి. అలాగే సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులను కూడా ఆ ముగ్గులో ఉంచాలి. ఇంకా చెప్పాలంటే మంగళవారం రోజున ఇంటిని శుభ్రం చేసే నీటిలో రాతి ఉప్పును ఉపయోగించి ఇంటిని శుభ్రం చేయాలి. అలాగే తల స్నానం చేసి ఎప్పుడు ధరించే బట్టలను విడిచి కొత్త దుస్తులను ధరించాలి. ఇంటి గేటు ముందు ముళ్ళ మొక్కలు, పొదలను ఉండకుండా చూసుకోవడం మంచిది…

ఇంటి తలుపులు సాయంత్రం ఆరువరకు ముయ్యాకుండా ఉండాలి.. ఇక ఉప్పును తీసుకొని ఎరుపురంగు గుడ్డలో కట్టి తలుపు దగ్గర పెట్టాలి..తర్వాత రోజు ఆ ఉప్పుని తీసుకొని ఏదైనా చెట్టు మొదట్లో వేస్తే మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఈ విధంగా చేస్తే మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ దూరమైపోతాయి.. ఇలా నెలలో ఏదొక మంగళవారం చేస్తే మంచిది.. మీ కోరికలు అన్ని వెంటనే తీరతాయి.. ఆర్థికంగా పుంజుకుంటారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version