అయితే ఏంటి.. అందులో తప్పేంటి.. విమర్శలను తిప్పికొట్టిన బజ్‌రంగ్‌ పునియా

-

గత కొద్దిరోజులుగా దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద రెజ్లర్లు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిరసనలో పాల్గొంటున్న రెజ్లర్లు.. సమీపంలోని 4 స్టార్‌ హోటల్లో భోజనం చేయడం సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా వీటిపై స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా స్పందించాడు. తమపై వస్తున్న విమర్శలను బజ్‌రంగ్‌ పునియా తిప్పి కొట్టాడు. ఇందులో తప్పేముందని అతను ప్రశ్నించాడు. బజ్‌రంగ్‌తో పాటు సంగీత ఫొగాట్‌ తదితరులు ఖరీదైన హోటల్లో భోజనం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతమయ్యాయి. దీనిపై కొందరు విమర్శలు చేసిన నేపథ్యంలో బజ్‌రంగ్‌ ఘాటుగా స్పందించాడు.

‘‘జంతర్‌ మంతర్‌ వద్ద అసలు ఎవరూ ఉండట్లేదన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మీడియా ప్రతినిధులు కూడా రాత్రి పూట పెద్ద ఎత్తున బస చేస్తున్నారు. మాతో పాటు మహిళలు ఉన్నారు. వారికి కొన్ని వ్యక్తిగత అవసరాలుంటాయి. స్నానాలు చేయాలి, బట్టలు మార్చుకోవాలి. అలాంటి పనులు రోడ్డు మీద చేయలేం కదా? మేం నిరసన చేస్తున్న చోట నీళ్లు కూడా ఉండవు. అందుకే హోటల్‌కు వెళ్లి వస్తున్నాం. నిరసన చేస్తున్నామంటే రోడ్డు మీదే స్నానాలు చేయాలని కాదు కదా? మేం ఇక్కడ నిద్ర పోవట్లేదని కూడా కొందరంటున్నారు. ఎప్పుడైనా వచ్చి తనిఖీ చేసుకోవచ్చు. మీడియా వాళ్లు ఎప్పుడూ ఇక్కడే ఉంటున్నారు’’ అని బజ్‌రంగ్‌ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version