కార్తీక మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది..? ముఖ్యమైన రోజులు ఇవే..!

-

ఈరోజు నుండి కార్తీక మాసం మొదలైంది. బ్రహ్మ ముహూర్తంలో కార్తీక స్నానం చేసి దీపంతో కార్తీక మాసాన్ని ప్రారంభిస్తారు. సూర్యోదయానికి పాడ్యమి తిధి ఉన్న రోజు కార్తీకమాస ప్రారంభంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అందుకని నవంబర్ 2న కార్తీకమాసం మొదలైంది. కార్తీక మాసానికి ఏ నెల కూడా సమానమైనదే కాదు. మహావిష్ణువుకి సమానమైన దేవుడు కూడా లేడు. గంగతో సమానమైన తీర్థం కూడా లేదు. కార్తీక మాసంలో ప్రతికూల ఆలోచనలకి ద్రోహం చేయాలనే ఆలోచనలకు దూరంగా ఉండాలి.

దేవుడిపై నమ్మకం ఉండే వాళ్ళు దేవుడిని పూజించడం మంచిది. దీపారాధన చేస్తే శివుడు అనుగ్రహం కలుగుతుంది. కార్తీక మాసం నియమాలని పాటించే వాళ్ళు నియమాలను పాటించని వాళ్ల చేతి వంట తినకూడదు. అలాగే కేవలం శాఖాహారం మాత్రమే తెలుసుకోవాలి. కార్తీక మాసంలో దుప్పట్లు వంటి విధానం చూస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది. ఇక కార్తీకమాసంలో వచ్చిన ముఖ్యమైన రోజుల గురించి చూద్దాం.

నవంబరు 02 కార్తీక మాసం ప్రారంభం
నవంబరు 03 భగినీహస్త భోజనం
నవంబర్ 04 మొదటి కార్తీక సోమవారం
నవంబరు 05 మంగళవారం నాగుల చవితి
నవంబర్ 11 రెండవ కార్తీక సోమవారం
నవంబరు 12 మంగళవారం ఏకాదశి
నవంబరు 13 బుధవారం క్షీరాబ్ది ద్వాదశి దీపాలు
నవంబరు 15 శుక్రవారం కార్తీకపూర్ణిమ
నవంబర్ 18 కార్తీకమాసం మూడో సోమవారం
నవంబర్ 25 కార్తీకమాసం నాలుగో సోమవారం
నవంబర్ 26 కార్తీక బహుళ ఏకాదశి
నవంబర్ 29 కార్తీక మాసం మాస శివరాత్రి
డిసెంబర్ 1 ఆదివారం కార్తీక అమావాస్య
డిసెంబర్ 2 సోమవారం మార్గశిర శుధ్ధ పాడ్యమి పోలి స్వర్గం

Read more RELATED
Recommended to you

Exit mobile version