తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం లో కామాంధులు రెచ్చిపోయారు. బుర్రిలంక గ్రామానికి చెందిన నర్సరీ కూలీ రౌతు కస్తూరి హత్య సంచలనంగా మారింది. మద్యం మత్తులో నలుగురు యువకులు….బుర్రిలంక గ్రామానికి చెందిన నర్సరీ కూలీ రౌతు కస్తూరిని రేప్ చేసి.. హత్య చేశారు.
గత నెల 15వ తేదీన వివాహిత మహిళ కస్తూరిని సామూహిక అత్యాచారం చేసి కాలువలో పడేశారు కామాంధులు. ఈ తరుణంలోనే… చొప్పెల్ల లాకులు వద్ద లభించిన కస్తూరి మృతదేహం తేలింది. ఇక ఈ మృతదేహాన్ని పోస్టుమార్టం పంపగా భయంకర నిజాలు..వెలుగులోకి వచ్చాయి. భర్త ఫిర్యాదు పై మొదట మిస్సింగ్ కేసు, మృతదేహం లభించిన తర్వాత అనుమానస్పద మృతి కేసు నమోదు అయింది., పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితులు బుర్రిలంకకు చెందిన దేవర యేసు, లోకి జయప్రసాద్, వెలుబుడి ప్రవీణ్, పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్ గా గుర్తించారు.