శ్రీ పురం స్వర్ణ దేవాలయం విశేషాలు…!

-

మన దేశం లో మహా లక్ష్మిని అష్టైశ్వర్య ప్రదాయినిగా పూజిస్తారు. మహాలక్ష్మి అమ్మవారిని అష్టలక్ష్మిలుగా కూడా కొలుస్తారు. సకల సిరి సంపదల రూపమైన లక్ష్మి అమ్మవారిని ప్రతి ఇంట కుల దైవంగా పూజిస్తారు. అలాంటి అమ్మవారికి ఉన్న స్వర్ణ దేవాలయానికి మూడు వైపులా నీరు, ఒక వైపు మాత్రమే ద్వారం ఉంటుంది. ఇంతకి ఆ దేవాలయం ఎక్కడ ఉందో, ఆ క్షేత్ర విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.

తమిళనాడులో వెల్లూర్ దగ్గర శ్రీ పురం అనే గ్రామం ఉంది. మలై కుడి అనే ప్రాంతానికి దగ్గరలో ఉన్న కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణం లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం చెన్నై నుంచి 180 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ గుడి లోపల, బయట కూడా బంగారు రేకులతో సుమారు 1500 కిలోల బంగారంతో నిర్మించారు అందుకే దీనికి స్వర్ణ దేవాలయం అని పేరు వచ్చింది. ఆలయ ఆవరణ మొత్తం నక్షత్ర ఆకారంలో సందర్శకులను ఆకర్షిస్తూ ఉండటం ఇక్కడ మరొక ప్రత్యేకత.

గుడిలోకి ప్రవేశి౦చే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రన్త్ లనుంచి సేకరించిన శ్లోకాలను పొందు పరిచారు. ప్రతి శుక్రవారం గుడిని అందంగా అలంకరిస్తారు. మరియు శుక్ర వారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించటానికి 700 మంది పోలిస్ లను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే ఈ దేవాలయ దర్శనానికి వచ్చే వారు తప్పని సరిగా సంప్రదాయ దుస్తులనే ధరించాలి. ఈ గుడి నిర్మించిన నారాయణి అమ్మ అను అతను మూడు కోట్ల ధనం తో సుమారు ఆ చుట్టూ పక్కల ఉన్న 600 దేవాలయాలను పునరుద్ధరించారు.

Read more RELATED
Recommended to you

Latest news