తక్కువ ధరకే వెంటిలేటర్లు… కీలక అడుగు వేసిన కేంద్రం…!

-

దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్య౦లో వైద్య పరికరాల కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది. మన దేశంలో పరిస్థితులు దారుణంగా మరే అవకాశాలు లేకపోయినా వైద్య పరికరాలను ఇప్పుడు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి గానూ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇందుకోసం ఇప్పుడు నూతన ఆవిష్కరణ వైపు అడుగులువేస్తున్నాయి.

ఈ క్రమంలోనే చిన్నపాటి వెంటిలేటర్ల తయారీ కోసం ఎలక్ట్రానిక్స్‌ తయారీ ప్రభుత్వరంగ సంస్థ ఐటీఐ, రక్షణ రంగ పరిశోధనా సంస్థ డీఆర్‌డీఓ కీలక అడుగు వేసాయి. ఈ రెండింటి మధ్య కీలక ఒప్పందం కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి. అందుకు అవసరం అయిన అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని డీఆర్‌డీఓ అందిస్తే మాత్రం కేవలం రెండు నెలల్లోనే వీటి తయారిని ఐటిఐ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

వీటి మధ్య రాబోయే రెండు రోజుల్లో ఒప్పందం కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి. ఐటీఐ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎం అగర్వాల్‌ మాట్లాడుతూ… 80-90 శాతం విడిభాగాలు దేశీయంగా సమీకరిస్తామని, మిగిలినవి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని మీడియాకు వివరించారు. తక్కువ ధరలోనే అందించే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం 57,000 వెంటిలేటర్లు అందుబాటులో ఉండగా… వీటి ధర ఒక్కొక్కటికి 5 నుంచి 15 లక్షల వరకు ఉన్నాయి. మేలో రెండు లక్షల వరకు వీటి అవసరం ఉంటుంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news