అబద్ధాలు చెప్పిన వారిని వదలని దేవుడు? అది ఎక్కడో తెలుసా..?

-

ఏ పూజ మొదలెట్టినా ముందుగా వినాయకుడినే పూజిస్తారు. అంతటి మహిమగలిగిన వినాయకుడు పాపాలు హరించే దేవుడని తెలిసుండకోవచ్చు. నేరాలు చేసి, ఇచ్చినమాట తప్పిన వారు ఈ ఆలయంలో మాత్రం స్వామి మహిమ చేత నిజాలే చెప్తారట. అలా చెప్పడం వల్ల వారి పాపాలు నశించిపోతాయని భక్తుల నమ్మకం. అసలు దీని పూర్తి చరిత్ర ఏంటో తెలుసుకోవాలంటే వివారాల్లోకి వెళ్లి తీరాల్సిందే!

Kanipakam - Wikipedia

పాపాలు హరించే దేవుడు వరసిద్ధి వినాయకుడు. చిత్తూరు జిల్లాకు 12 కి.మీ. దూరంలోని బహుదా నదీ తీరాన వెలసిన పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం. ఈ ఆలయంలో వినాయకుడిన ఇస్థానికుడు, ప్రమాణాల దేవుడిని పిలుస్తారు. నేరాలు చేసి ఇచ్చినమాట తప్పిన వార ఈ ఆలయంలో స్వామి మహిమతో నిజాలే చెప్తారు. ఒకవేళ నిజాలు దాచి అబద్ధాలు చెబితే వరాఇని స్వామి ఐరికే వదలడని ప్రతీతి. కాణి అంట తడిసిన నేల అని అర్థం. పాకమ్‌ అంటే తడినేలలోకి నీళ్ల ధార అని అర్థం. గణనాధుడు ఈ ఆలయంలో బావి నుంచి వెలిశాడు. కనుక ఆయనకు స్వయంభూ వరసిద్ధి వినాయకుడు అనే పేరు వచ్చింది. ఆయన వెలసిన బావిలోని పవిత్ర జలాన్ని భక్తులు తీర్థంలా సేవించి తరిస్తున్నారు.

స్థల పురాణం :

పూర్వకాలంలో గుడ్డి, మూగ, చెవిటి అంగవైకల్యాలు కలిగిన ముగ్గురు సోదరులు కాణిపాకం ప్రాంతంలో నివసించేవారు. వ్యవసాయం చేసుకుంటూ తమ జీవితాన్ని సాగించేవారు. ఆ కాలంలో వ్యవసాయం చేసేందుకు గూడ పద్ధతి ద్వారా నీటిని తోడుకునేవారు. బావి పక్కన గొయ్యి తవ్వి ఇద్దరు మనుషులు బావిలోంచి నీటిని తోడి పోసేవారు. అంగవైకల్యం కలిగిన వీరు ముగ్గురు సోదరులు కష్టాలు పడుతూ ఇలానే జీవితం సాగిస్తున్నారు. ఒకనాడు ఆ బావి నీరు ఇంకిపోయే దశకు చేరుతుంది. దీంతో వ్యవసాయం ఎలా సాగించాలో అక్కడి వారికి అర్థం కాలేదు. ఓ రోజు ముగ్గురి సోదరుల్లో ఒకరు బావిలోకి దిగి త్రవ్వడం ప్రారంభించాడు. ఆ సమయంలో రాతి విగ్రహం లాంటిదేదో అతని పారకు తగిలింది.

Kanipakam Vinayaka Temple Kanipakam - Holy Shrines

అది ఏమిటో చూసేలోపే అక్కడ నుంచి రక్తం రావడం ప్రారంభమయింది. నిముషాల్లోనే బావి మొత్తం రక్తంతో నిండిపోయింది. ఆ మరుక్షణమే అంగవైకల్యంతో బాధపడుతున్న ఈ ముగ్గురి లోపాలు మాయమై మామూలు మనుషులయ్యారు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు అక్కడకు చేరుకొని బావిని తవ్వే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నం ఫలించలేదు. అక్కడ నుంచి స్వయంభూ వినాయకుడు ఉద్భవించాడు. అప్పట్నుంచీ స్వయంభూ వరసిద్ధి వినాయకుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news