ఆయుర్వేద మూలికలు ఆరోగ్య సమస్యలను తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. అలానే అనేక విధాలుగా సహాయపడుతాయి. అయితే ఇక్కడ కొన్ని ఆయుర్వేద మూలికలు వలన కలిగే ఉపయోగాలు ఉన్నాయి. మరి వాటి కోసం తెలుసుకుని సమస్యలను పరిష్కరించుకోండి.
అశ్వగంధ:
అశ్వగంధని ఆయుర్వేదం వైద్యం లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒత్తిడిని తొలగించడంలో అశ్వగంధ బాగా పని చేస్తుంది. నిద్రలేమి సమస్యలు కూడా అశ్వగంధ తొలగిస్తుంది. జ్ఞాపక శక్తి పెంపొందించుకోవడానికి, బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
ఉసిరి:
ఉసిరిని కూడా ఆయుర్వేద వైద్యం లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జుట్టు సమస్యలను కూడా సులువుగా తొలగిస్తుంది. కనుక ఉసిరిని కూడా మీరు ఉపయోగించవచ్చు.
త్రిఫల:
త్రిఫల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ల ని అదుపు చేస్తుంది. ఆర్థరైటిస్ ఇన్ఫ్లమేషన్ ని కూడా ఇది తగ్గిస్తుంది.
బ్రహ్మీ:
బ్రహ్మీ కూడా ఆయుర్వేద వైద్యం లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది కూడా ఒక మంచి మూలిక అనే చెప్పవచ్చు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. జ్ఞాపక శక్తి పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒత్తిడిని కూడా ఇది తొలగిస్తుంది.
యాలుకలు:
యాలుకల పొడి బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుంది. అలానే కడుపులో వచ్చే అల్సర్లని కూడా ఎలుకలు తొలగించడానికి సహాయం చేస్తాయి.