నారసింహస్వామి జయంతినాడు ఏం చేయాలి ?

-

నారసింహస్వామి హిరణ్యకశ్యపుడిని సంహరించడానికి స్తంభంలో నుంచి అవతరించిన రోజునే స్వామి జయంతిగా జరుపుకొంటాం. వైశాఖ శుద్ధ చతుర్దశి స్వామి అవతరించిన రోజు. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానం చేసి శ్రీనృసింహస్వామివారిని కొబ్బ్బరినీల్లతో, తేనెతో, ఆవుపాలతో, శ్రీ సూక్త, పురుష సూక్త సమన్వితంగా అభిషేకించి శ్రీ నారసింహ సహస్రనామ స్తోత్రం చేయాలి. స్వామివారికి వడపప్పు, పానకం నివేదన చేయాలి.

ఈ రోజు ఉపవాసం చేయాలి. ఈ విధంగా నృసింహ జయంతిని జరుపుకోవాలి. అదేవిధంగా స్వామికి నివేదించిన పదార్థాలను ప్రసాదంగా స్వీకరించాలి. భక్తితో స్వామి నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయాలి. అసుర సంధ్యవేళలో స్వామిని ఆరాధించడం అత్యుత్తమం. ఉదయం, సాయంత్రం స్వామి ఆరాధన చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news