ఒక్కో దేవునికి ఒక్కో వాహనం. భారీకాయం కానీ చిన్న మూషిక వాహనం. అయితే దీనిలో పలు రహస్యాలు దాగి ఉన్నాయంటారు మన పండితులు అవేమిటో పరిశీలిద్దాం… వినాయకుని వాహనం మూషకం. ముషస్తేయే అనే ధాతువు మీద మూషకం లేదా మూషికమనే మాట ఏర్పడింది. దీనికి ఎలుక అని అర్థం.
ఈ ఎలుక మీద వినాయకుడు ఉంటాడంటే ఎవరైనా సరే, దొంగబుద్ధితో దాచకు. అనుభవించకుండా నిలవ ఉంచుకోకు! చంచలత్వాన్ని నియంత్రించుకుని నిశ్చలతతో ఉంటే విఘ్నం నీ దరి చేరదు, విజయం నీ చెంత నుంచి వెనక్కు మళ్లదు అని సంకేతార్థం. మూషిక వాహన రహస్యం తెలిసింది కదా!
కేశవ